హైదరాబాద్ లోని మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇది.. కూకట్ పల్లిలో ఇటీవల ప్రారంభమైన లేక్ షోర్ మాల్ లో 9 స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన 9 స్క్రీన్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం. హైదరాబాద్ లో 19వ సినిమా థియేటర్‌గా ఆవిర్భవించిన ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌లో పివిఆర్ స్క్రీన్ల సంఖ్య 119కి చేరిందని నిర్వాహకులు వెల్లడించారు.
ఈ మల్టీప్లెక్స్‌లో స్క్రీన్ 6ను ప్రత్యేకంగా పిఎక్స్‌ఎల్ పేరిట తీర్చిదిద్దామని... భారీ తెరతో పాటు 4K లేజర్ ప్రొజెక్షన్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చినట్లు తెలిపారు. చిన్నారులతో వచ్చే తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్క్రీన్-5ను ప్రత్యేకంగా డిజైన్ చేశామని... ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించామని తెలిపారు.
►ALSO READ | ఢిల్లీకి ప్రపంచ ఐటీ, ఏఐ దిగ్గజాలు.. ఒక్క రాత్రి హోటల్ అద్దె రూ.32 లక్షలు.. అయినా నో రూమ్స్..!
ప్రతి స్క్రీన్‌ను ఒక్కో ప్రత్యేక థీమ్‌తో రూపొందించడం జరిగిందని అత్యున్నత స్థాయి సీటింగ్, ప్రీమియం సదుపాయాలు ఉన్నప్పటికీ, టికెట్ ధరలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు నిర్వాహకులు.
