
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కూతురు వాణికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై పీవీ మనవడు సుభాష్ విమర్శలు చేశారు. ఓడిపోయే స్థానం నుంచి తన చిన్నమ్మ వాణికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందన్నారు. కుటిల రాజకీయాలతో పీవీ పేరు చెప్పుకుని తమ కుటుంబాన్ని మోసం చేశారన్నారు. బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఓడిపోయే స్థానం నుంచి టీఆర్ఎస్ పీవీ వాణికి టికెట్ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ తప్పుబట్టారు. పీవీపైన టీఆర్ఎస్ కు అంత ప్రేమ ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా లేదా.. రాజ్యసభకు పోటీ చేయించాలన్నారు.