OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు

OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు

కడుపులో11 తుపాకీ బుల్లెట్లతో ఓ కొండచిలువ అటవీ శాఖ అధికారులకు లభ్యమైంది. అయినప్పటికీ  ఆ కొండచిలువ చనిపోలేదు. ఈ  ఘటన  మంగళూరులో చోటుచేసుకుంది. అనేగుండి నగరంలో పర్షియన్ పిల్లిని కొండచిలువ వేటాడింది. అది పిల్లిని మింగుతుండగా దాని మెడ వలకు చిక్కుకుంది.  దీంతో స్థానికులు నిపుణుడు భువన్ దేవాడిగను సంప్రదించగా ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నఅధికారులు కొండచిలువను వల నుంచి విడిపించారు.

అనంతరం ఆ  కొండచిలువకు డాక్టర్ యశస్వి చికిత్స అందించారు. చికిత్సలో భాగంగా ఎక్స్-రే పరీక్ష చేయగా దాని కడుపులో 11 బుల్లెట్లు ఉన్నట్లుగా తేలింది. ఈ బుల్లెట్లు చాలా సంవత్సరాల క్రితం నుంచి కొండచిలువ శరీరంలో ఉన్నట్లుగా కనుగొన్నారు. కొండచిలువ లోపల తొమ్మిది బుల్లెట్లు ఉండగా వాటిని తొలగించడం సాధ్యం కాకపోవడంతో  కొండచిలువ చర్మానికి దిగువన ఉన్న రెండింటిని తొలగించారు. 12 కేజీల బరువున్న ఈ కొండచిలువ ప్రస్తుతం కోలుకుంటుంది.