టెన్త్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్!

టెన్త్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్!
  •     స్కాన్ చేస్తే లొకేషన్ మ్యాప్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు
  •     సెంటర్ అడ్రస్ ఈజీగా తెలిసేలా విద్యాశాఖ ప్లాన్
  •     5.27 లక్షల మంది స్టూడెంట్లు, మార్చి 14 నుంచి పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: టెన్త్ విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ వెతుక్కునే తిప్పలు తప్పించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లపైనే ‘క్యూఆర్ కోడ్’ ముద్రించే యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు రెడీ చేస్తున్నారు. దీంతో సెంటర్లను సులభంగా గుర్తించే అవకాశాలున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం ఇప్పటికే 5.27 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించారు. వీరందరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్  ప్రయోగాన్ని అమలు చేయాలని అధికారులు చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌‌‌‌‌‌‌‌తో ఆ కోడ్‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేయగానే గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్ తెలిసేలా చర్యలు చేపడుతున్నారు.

విద్యార్థులు కన్ఫ్యూజ్‌‌‌‌‌‌‌‌ కాకుండా.. 

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధితో పాటు పలు జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను గుర్తించడం విద్యార్థులకు, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు సవాలుగా మారుతోంది. కొన్ని స్కూళ్ల పేర్లు సేమ్ ఉండటంతో పాటు అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో పరీక్ష రోజు విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే అధికారులు క్యూఆర్​ టెక్నాలజీని వాడాలని భావిస్తున్నారు.