ఏపీ టెక్​పార్కులో క్వాంటం కంప్యూటర్​

ఏపీ టెక్​పార్కులో క్వాంటం కంప్యూటర్​

హైదరాబాద్​, వెలుగు:  క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోహరించడానికి ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు కలిపాయి. ఈ టెక్ పార్క్​ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు.  

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐబీఎంతో కలసి క్వాంటం అల్గోరిథం  అప్లికేషన్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి,  మనదేశ క్వాంటమ్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ఈ భాగస్వామ్యం వల్ల టీసీఎస్ పరిశోధకులకు, భారతీయ పరిశ్రమలోని నిపుణులకు,  విద్యాసంస్థలకు ఐబీఎం  క్వాంటం కంప్యూటర్లను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది.