బోర్ కొట్టకుండా పడవలో క్వారంటైన్

బోర్ కొట్టకుండా పడవలో క్వారంటైన్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే చర్యలు తీసుకోవాల్సిందే. అందుకే, ఆయా దేశాల్లో కొన్ని ఆంక్షలు పెట్టాయి. థాయ్లాండ్కు వచ్చేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉండాలనే రూల్ పెట్టారు అక్కడి అధికారులు. క్వారంటైన్లో ఉండాలంటే చాలామందికి ఇబ్బందిగా, బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే, థాయ్లాండ్ టూరిజం డిపార్ట్మెంట్ పడవలో క్వారంటైన్ ఏర్పాటు చేసింది.  సముద్రంలో విహరిస్తూ, కొండల మధ్య అందాలు చూస్తూ క్వారంటైన్ను ఎంజాయ్ చేయొచ్చు. కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్న టూరిజం సెక్టార్ను దాని ద్వారానే మళ్లీ బూస్టప్ చేయాలనుకున్నారు థాయ్ అధికారులు. అయితే, దీనికి వారొక రూల్ పెట్టారు. ఆర్టిపీసీఆర్ టెస్ట్లో నెగెటివ్ వచ్చిన వాళ్లను మాత్రమే క్వారంటైన్లో ఉండేందుకు అనుమతిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ల హెల్త్ మానిటర్ చేస్తుంటారు. 

పడవల్లో క్వారంటైన్ అవుతున్నవాళ్ల చేతికి ఒక డిజిటల్ బ్యాండ్ కడతారు. దాని ద్వారా వాళ్ల బీపీ, టెంపరేచర్, లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద నవంబర్లో దీన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం పుకెట్ ఏరియాలో 100 పడవల్లో క్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి. డిజిటల్ ఎకానమీ ప్రమోషన్ ఏజన్సీ (డీఈపీఏ) అక్కడి టూరిస్టులను మానిటర్ చేస్తోంది. 14 రోజుల క్వారంటైన్ తర్వాత వారు ఐలాండ్కి రావచ్చు.