ఫారిన్​ నుంచి వచ్చేటోళ్లకు క్వారంటైన్​ వారం రోజులే

ఫారిన్​ నుంచి వచ్చేటోళ్లకు క్వారంటైన్​ వారం రోజులే
  •                సొంత ఖర్చులతో సెంటర్‌‌లో ఉండాలె
  •                 మరో వారం రోజులు ఇంట్లో క్వారంటైన్​
  •                 ఎయిర్​పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను
                   రెగ్యులర్​గా శానిటైజ్ చేయాలని ఆదేశం
  •                 నేటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభం

విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లు ఇకపై వారం పాటు క్వారంటైన్​ సెంటర్లో ఉంటే సరిపోతుందని, మరో వారం హోం క్వారంటైన్​లో ఉండాలని సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్​ సెంటర్లో ఉండడానికి అయిన ఖర్చులను ఎవరికి వారే భరించాలని పేర్కొంది. గమ్యం చేరాక 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంటానని ఫ్లైట్​ ఎక్కడానికి ముందే ప్యాసింజర్​ సెల్ఫ్ డిక్లరేషన్​ఇవ్వాలని తెలిపింది. ఎయిర్​పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో థర్మల్​ స్క్రీనింగ్​ ఏర్పాటు చేయాలని, ప్యాసింజర్స్​ టెంపరేచర్​ను టెస్ట్​ చేయాలని ఆదేశించింది.  సోమవారం నుంచి డొమెస్టిక్​ ఫ్లైట్స్, జూన్​ 1 నుంచి 100 రైళ్లు ప్రారంభం కానున్నందున సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ తాజాగా ఆదివారం గైడ్​లైన్స్​ విడుదల చేసింది.

ఇవీ గైడ్​లైన్స్​

ఎయిర్​పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోని ఎంట్రీ, ఎగ్జిట్​ పాయింట్​ వద్ద థర్మల్​ స్క్రీనింగ్​  కంపల్సరీ.

ఆరోగ్య సేతు యాప్​ను ప్యాసింజర్స్​ తమ స్మార్ట్​ఫోన్లలో డౌన్​లోడ్​ చేసుకోవాలి.

కరోనా లక్షణాలు లేని​ ప్యాసింజర్స్​ను మాత్రమే అనుమతించాలి.

ప్యాసింజర్స్​కు ‘ఏవి చేయాలి.. ఏవి చేయకూడదు..’ అనే వివరాలను టికెట్లతోపాటు ట్రావెల్​ ఏజెన్సీలు  ముంద్రించి ఇవ్వాలి. కొవిడ్​ –19 నివారణపై ఎయిర్​పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రకటనలు డిస్​ప్లే చేయాలి.  వాటిని ప్యాసింజర్స్​ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి ప్యాసింజర్​ తప్పనిసరిగా ఫేస్​ మాస్కు ధరించాలి. హ్యాండ్స్​ను శానిటైజ్​ చేసుకోవాలి. డిస్టెన్సింగ్​ను    పాటించాలి.

ఎయిర్​పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల ను రెగ్యులర్​గా శానిటైజ్/ డిస్​ఇన్​ఫెక్టెడ్​ చేయాలి. ప్యాసింజర్స్​ కోసం సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

ప్రయాణం ముగించుకొని దిగినవాళ్లలో 14 రోజుల్లో లక్షణాలు బయటపడితే డిస్ట్రిక్​ సర్వైలైన్స్​ ఆఫీసర్, స్టేట్​/నేషనల్​ కాల్​ సెంటర్​ 1075కు సమాచారమివ్వాలి.

ఎయిర్​పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో థర్మల్​ స్క్రీనింగ్​ చేస్తున్నప్పుడు కరోనా లక్షణాలు బయటపడితే.. సమీపంలోని ఐసోలేషన్​ సౌలతు ఉన్న హాస్పిటల్​కు తరలించాలి. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే.. కొవిడ్​ హాస్పిటల్​కు షిఫ్ట్​ చేయాలి.

మైల్డ్​ సింప్టమ్స్​ ఉంటే హోం ఐసోలేషన్​ గానీ, కొవిడ్​ కేర్​ ఐసోలేషన్​ సెంటర్​లో గానీ.. ప్యాసింజర్స్​కే  ఆప్షన్​ ఇవ్వాలి.

కరోనా లక్షణాలు ఉన్నవాళ్లలో పాజిటివ్​ అని తేలితే.. కొవిడ్​ హాస్పిటల్స్​లోనే ఉంచి ట్రీట్​మెంట్​ ఇవ్వాలి. నెగెటివ్​ అని తేలితే ఇంటికెళ్లేందుకు అనుమతిం చొచ్చు. అలాంటివాళ్లు వారంపాటు హోం ఐసోలేష న్​లో ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని 1075 కాల్​ సెంటర్​కు గానీ  సమాచారం అందించాలి.

స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు క్వారం టైన్​/ఐసోలేషన్​కు సంబంధించి సొంత ప్రొటోకాల్​ను డెవలప్​ చేసుకోవచ్చు.

సెల్ఫ్​ డిక్లరేషన్​ తప్పనిసరి

ఇంటర్నేషనల్​ ప్యాసింజర్స్​ పాటించాల్సిన గైడ్​లైన్స్​ను కూడా సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ విడుదల చేసింది. ఆగస్టుకు ముందే ఇంటర్నేషనల్​ విమానాలను ప్రారంభించేందుకు సివిల్​ ఏవియేషన్​ మినిస్ట్రీ ఏర్పాట్లు చేస్తున్నందున ఈ గైడ్​లైన్స్​ విడుదలయ్యాయి. కరోనా లక్షణాలు లేని ప్యాసింజర్స్​ను మాత్రమే అనుమతించాల్సి ఉంటుందని, అయితే.. ప్యాసింజర్​ తప్పనిసరిగా తాను 7 రోజులు క్వారంటైన్​ సెంటర్లలో సొంత ఖర్చులతో, మరో 7 రోజులు హోం క్వారంటైన్​లో (14రోజులు)  ఉంటానని సెల్ఫ్​ డిక్లరేషన్​ను బోర్డింగ్​కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. గర్భిణులు, ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చేవాళ్లు, పదేండ్లలోపు పిల్లలకు, ప్రత్యేక కారణాలతో వచ్చినవారికి మాత్రం 14 రోజుల హోం క్వారంటైన్​కు అనుమతించొచ్చని మినిస్ట్రీ స్పష్టంచేసింది. ఇంటర్నేషనల్​ ప్యాసింజర్స్​ తప్పకుండా ఆరోగ్య సేతు యాప్​ను డౌన్​ లోడ్​ చేసుకోవాలని, అందులో సెల్ఫ్​ డిక్లరేషన్​ ఫామ్​ అందుబాటులో ఉంటుందని సూచించింది. ప్యాసింజర్స్​ రాకపోకల టైంలో తప్పకుండా థర్మల్​ స్క్రీనింగ్​ చేయాలి.  వైరస్ లక్షణాలు బయటపడితే.. వెంటనే ఐసోలేషన్​కు తరలించాల్సి ఉంటుంది.

దేశంలో మరణాలు 4,000