హాస్పిటళ్లకు పేషెంట్ల క్యూ..కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకు వెయ్యికి పైగా ఓపీ

హాస్పిటళ్లకు పేషెంట్ల క్యూ..కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకు వెయ్యికి పైగా ఓపీ
  • పేషెంట్లలో ఎక్కువ మంది జ్వర పీడితులే
  • ఉమ్మడి జిల్లాలో 17  రోజుల్లో 17 డెంగ్యూ కేసులు
  • నిరుడితో పోలిస్తే డెంగ్యూ కేసులు తక్కువే 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీనగర్ జిల్లాను వైరల్​ఫీవర్స్ వణికిస్తున్నాయి. వానలు కురవడం, వాతావరణం చల్లబడి చిత్తడిగా మారడం, దోమల వృద్ధితో జనం మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నారు. వీటికి తోడు దగ్గు, జలుబు వేధిస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని హాస్పిటళ్లు పేషెంట్లతో రద్దీగా మారాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో సోమవారం ఒక్కరోజే 1,356 మంది పేషెంట్లు ఓపీలో డాక్టర్లకు చూపించుకున్నారు. ఓపీలో చూపించుకునేందుకు, మందులు తీసుకునేందుకు పేషెంట్లు, వారి బంధువులు గంట, రెండు గంటలపాటు క్యూలైన్ లో నిలబడాల్సి వచ్చింది.

వీరిలో ఎక్కువ మంది  వైరల్ ఫీవర్, దగ్గు, జలుబుతో బాధపడేవాళ్లే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. వీళ్లలో కొందరిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ కావాలని సూచించారు. ప్రస్తుతం కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ అనారోగ్య సమస్యలతో 452 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స తీసుకుంటున్నారు. పీడీయాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్డులో 40 బెడ్స్ ఉండగా.. 50 మంది వరకు చిన్నారులు ట్రీట్ మెంట్ పొందుతున్నారు. వీళ్లలో జ్వర పీడితులే ఎక్కువ మంది ఉన్నారు. కరీంనగర్ తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి ఏరియా హాస్పిటళ్లు, ప్రైవేట్ హాస్పిటళ్లలో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. 

నిరుడితో పోలిస్తే డెంగ్యూ జ్వరాలు తక్కువే.. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జ్వరాలబారిన పడిన వారి సంఖ్య పెరగడం, ఇందులో చాలా మందికి డెంగీ లక్షణాలు ఉంటున్నాయి. అయితే లక్షణాలు ఉన్నంతమాత్రాన అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కాదని డాక్టర్లు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైనా డెంగ్యూ టెస్టుల్లో పాజిటివ్ వస్తే.. వెంటనే శాంపిళ్లను ఎలిశా టెస్టు కోసం జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ గా రిపోర్ట్ వస్తేనే డెంగ్యూ జ్వరంగా నిర్ధారిస్తున్నారు.

ఈ లెక్కల ప్రకారం.. నిరుడితో పోలిస్తే డెంగీ అదుపులో ఉన్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి వెల్లడించారు. సాధారణంగా ఏటా జూలై, ఆగస్టు నెలల్లోనే డెంగీ జ్వరాలు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. నిరుడు జూలైలో 30 డెంగ్యూ కేసులు నమోదైతే ఈ ఏడాది జూలైలో 10 కేసులు, అలాగే నిరుడు ఆగస్టులో మొత్తం 73 కేసులు నమోదైతే ఈ నెల 17 రోజుల్లో 16 కేసులు మాత్రమే నమోదవడం కొంత ఊరటనిస్తోంది.   

డెంగ్యూ పేరుతో ప్రైవేట్ హాస్పిటళ్ల దందా.. 

జనాలు జ్వరాలతో బాధపడుతుండగా జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు దండుకుంటున్నాయి. జ్వరం వచ్చిందని వెళ్తే  మలేరియా, టైఫాయిడ్, ప్లేట్ లెట్స్ కౌంట్(పీఎల్టీ) టెస్టులతోపాటు యూరిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని, ప్లేట్ లెట్స్ కౌంట్ తక్కువగా ఉందంటూ భయాందోళనకు గురి చేసి అడ్మిట్ అయ్యేలా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో జ్వరమని ప్రైవేట్ హాస్పిటల్ కు వెళితే సుమారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. 

కరీంనగర్ జీజీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపీ వివరాలు

ఆగస్టు    11    1,417
ఆగస్టు    12    1,151
ఆగస్టు    13    1,102
ఆగస్టు    14    1,043
ఆగస్టు    18    1,356