భారత్ పెట్రోల్ బంకులో మంటలు.. హైదరాబాద్లో ఘటన.. కారుకు పెట్రోల్ కొట్టించుకుని వెళుతుండగా..

భారత్ పెట్రోల్ బంకులో మంటలు.. హైదరాబాద్లో ఘటన.. కారుకు పెట్రోల్ కొట్టించుకుని వెళుతుండగా..

రంగారెడ్డి జిల్లా: కాటేదాన్ పారిశ్రామికవాడలో రబ్బర్ కంపెనీలో ఫైర్ జరిగిన ఘటన మరువకముందే మళ్ళీ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న భారత్ పెట్రోల్ పంపులో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. రెనాల్ట్ క్విడ్ కారు పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న క్రమంలో పెట్రోల్ బంకులోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఈ విషయాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

షాద్ నగర్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్తున్న సుదర్శన్ అనే వ్యక్తి మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పక్కన భారత్ పెట్రోల్ పంపులు పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న క్రమంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. మంటలు అంటుకున్న సమయంలో పెట్రోల్ బంకులో కొన్ని వాహనాలు పెట్రోల్ పోయించుకుంటున్నాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ALSO READ | హైదరాబాద్ SR నగర్ క్రిష్ ఇన్ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్

హైదరాబాద్లోని సనత్ నగర్లో కూడా పెద్ద ప్రమాదమే తప్పింది. సనత్ నగర్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్లో ఓ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇల్లు దగ్ధం అయ్యింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చే లోపే ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సత్యనారాయణకు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో  జూలై 3న ఉదయం ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.