డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి :  ఎంపీ ఆర్. కృష్ణయ్య
  •     ఎంపీ ఆర్. కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: ఎన్నికల హామీలను విస్మరించి నిరుద్యోగులను వంచించడం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం లక్డీకాపూల్‌‌‌‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. 

ఈ నిరసనలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య నిరుద్యోగులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. టీచర్ల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు.