82 వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య

82 వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 82 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు 10 నెలల క్రితం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, 82 వేలు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోర్ కమిటీ సమావేశం గుజ్జ కృష్ణ అధ్యక్షతన బుధవారం కాచిగూడలో జరిగింది. తర్వాత కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగుల పదవీ కాలం ముగిసిన వెంటనే వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అయితే వెంటనే ఎలక్షన్లు పెట్టి ఎన్నుకుంటున్నప్పుడు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయరని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు పదవి విరమణ పొందిన నెలలోపే కొత్త నియామకాలు చేపట్టేలా రాజ్యాంగ సవరణ చేయాలని, అందుకు పార్లమెంటులో పోరాడుతానని తెలిపారు.