హైదరాబాద్ సిటీలో కొత్త సర్కిళ్లు..కొత్త జోన్లు ఇవే..మీరు ఏ వార్డులో ఉన్నారో తెలుసుకోండి.

హైదరాబాద్ సిటీలో కొత్త సర్కిళ్లు..కొత్త జోన్లు ఇవే..మీరు ఏ వార్డులో ఉన్నారో తెలుసుకోండి.
  •     జీహెచ్​ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్  నోటిఫికేషన్ జారీ
  •     300 వార్డుల్లో సరిహద్దులు ఖరారు చేస్తూ తుది ప్రకటన
  •     బల్దియా వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ జారీ
  •     300 వార్డుల్లో సరిహద్దులు ఖరారు చేస్తూ తుది ప్రకటన

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా డీలిమిటేషన్ ఖరారు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే, 60 సర్కిల్స్, 12 జోన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 570 అనుసరించి ఎప్పటికప్పుడు సవరించిన తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు (వార్డుల పునర్విభజన) నియమాలు, 1996లోని రూల్ 11, జజీవో 291 మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణ అభివృద్ధి చట్టంలోని నిబంధనల ప్రకారం 300 వార్డుల పునర్విభజన ఖరారు చేసినట్టు నోటిఫికేషన్​లో స్పష్టం చేశారు. వార్డుల సరిహద్దుల వివరాలు అన్ని సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయల నోటీసు బోర్డులతో పాటు జీహెచ్ఎంసీ వెబ్ సైట్ www.ghmc.gov.in లో కూడా అందుబాటులో ఉంచినట్టు కమిషనర్ ఫైనల్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వార్డులపై వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని పలు వార్డుల పేర్లు మార్చారు. అలాగే, ఎక్కువగా అభ్యంతరాలు వచ్చిన బౌండరీలను కూడా మార్పు చేసి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

సర్కిళ్లు.. జోన్లు ఇవే

1)  మల్కాజ్‌‌‌‌గిరి:  కీసర,  అల్వాల్,  బోయిన్‌‌‌‌పల్లి,  మౌలాలీ, మల్కాజ్​గిరి
2) ఉప్పల్ : ఘటకేసర్,  కాప్రా, నాచారం, ఉప్పల్,  బోడుప్పల్
3) ఎల్బీ నగర్ : నాగోల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్,  హయత్‌‌‌‌నగర్
4) శంషాబాద్ : ఆదిభట్ల, బడంగ్‌‌‌‌పేట్, జల్​పల్లి, శంషాబాద్
5) రాజేంద్ర నగర్: రాజేంద్ర నగర్, అత్తాపూర్, చార్మినార్, బహదూర్‌‌‌‌పురా, ఫలక్‌‌‌‌నుమా, చంద్రాయణగుట్ట, జంగమ్మెట్
6) చార్మినార్ : సంతోష్ నగర్, యాకుత్‌‌‌‌పురా, మలక్‌‌‌‌పేట్, చార్మినార్, మూసారాంబాగ్
7) గోల్కొండ: గోషామహల్, కార్వాన్,  గోల్కొండ,  మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్
8) ఖైరతాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌‌‌‌గూడ, అమీర్‌‌‌‌పేట్
9) సికింద్రాబాద్: కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌‌‌‌పేట్, తార్నాక, మెట్టుగూడ
10) శేరిలింగంపల్లి : నార్సింగి, పటాన్‌‌‌‌చెరు, అమీన్‌‌‌‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి
11) కూకట్‌‌‌‌పల్లి: మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌‌‌‌పల్లి, మూసాపేట్
12) కుత్బుల్లాపూర్: చింతల్, జీడిమెట్ల, దుండిగల్ కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, మేడ్చల్