ముషీరాబాద్ : ముఖ్యమంత్రి స్పందించి ఆర్టీసీ జేఏసీ కార్మికులతో చర్చలు జరిపి డిమాండ్లను అంగీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు.
గురువారం విద్యానగర్ బీసీ భవన్ లో అనంతయ్య, రాజేందర్ అధ్యక్షతన ఆర్టీసీ సమ్మె.. ప్రజల ఇబ్బందులపై సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ సమ్మె ముదరకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

