నేను కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టుకోలేనా? 

V6 Velugu Posted on Jul 15, 2021

హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఖండించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం తన మనసుకు బాధ కలిగించాయన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు నాకు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి. అలాంటిది ఇంటి అద్దె కట్టుకోలేనా? నేను కోట్లు సంపాదించా. నా వరకు సరిపడా దాచుకున్నా. మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

Tagged fans, Gaddar, R. Narayana Murthy, Social Media News

Latest Videos

Subscribe Now

More News