
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12న జరగనున్న భారత్- బంగ్లా మూడో టీ20 క్రికెట్ మ్యాచ్భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు. డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెచ్సీఏ ప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రేక్షకులకు అసౌకర్యం, టికెట్ల పంపిణీలో గందరగోళం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. -వెలుగు, ఉప్పల్