కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర.. ఐపీఎల్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం అతను న్యూజిలాండ్‌కు తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ శుక్రవారం వెల్లడించింది.
ఈ సీజన్‌లో ఆల్‌రౌండర్‌గా కామెరూన్ గ్రీన్‌కు ఎక్కువగా చాన్స్ ఇవ్వడంతో రచిన్‌కు తుది జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రచిన్ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం అతను పూర్తి స్థాయిలో సిద్ధం కానున్నాడు.
