నయనతారపై సీనియర్ నటుడు అసభ్య కామెంట్స్

V6 Velugu Posted on Apr 01, 2021

చెన్నై: తమిళ సీనియర్ నటుడు రాధా రవి మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ హీరోయిన్ నయనతార పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకేను టార్గెట్ చేసిన రాధా రవి.. ఆ పార్టీ యువ నేత, యంగ్ హీరో, కరుణానిధి మనుమడు ఉదయనిధి స్టాలిన్ తో నయన రిలేషన్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. నయన వల్లే డీఎంకే తనను బహిష్కరించింది అని ఆరోపించారు.  'డీఎంకేకు నయనతారతో ఏం సంబంధం? ఆమె ఆ పార్టీకి ప్రజా వ్యవహారాల అధికారా? నయన గురించి మాట్లాడితే నన్ను పార్టీ లో నుంచి తొలగించారు. అయినా నయన, ఉదయనిధి రిలేషన్ షిప్ లో ఉంటే నేను మాత్రం ఏం చేయగలను' అని రాధా రవి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి స్పందించారు. రాధా రవి నుంచి ఇలాంటి అసభ్య కామెంట్లు చాలాసార్లు చూశానని, ఇలాంటి వ్యక్తులను స్టార్ క్యాంపెయిన్ గా ఎందుకు పెడతారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి నేతలకు అధికారం ఇచ్చి అందలం ఎక్కిస్తే ఇక అంతే సంగతులు అని విమర్శించారు.

Tagged Assembly Elections, tamilnadu, Controversy, DMK, heroine, Nayanatara

Latest Videos

Subscribe Now

More News