రథసప్తమి.. సూర్యభగవానుడికి సమర్పించాల్సిన నైవేద్యం ఇదే..! .. ఏ ఆకులో పెట్టాలి..!

రథసప్తమి.. సూర్యభగవానుడికి సమర్పించాల్సిన నైవేద్యం ఇదే..! .. ఏ ఆకులో పెట్టాలి..!

కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు... ప్రపంచానికి వెలుగునిస్తూ..  సకల జీవరాశులకు ప్రాణ శక్తి రావడానికి దోహదం చేస్తున్న సూర్యుడి పుట్టిన రోజును రథసప్తమి (2026 జనవరి 25)  అంటారు. మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

 హిందువులు జరుపుకునే పండుగల్లో రథసప్తమి కూడా ముఖ్యమైనదే.  రథసప్తమి రోజు (జనవరి25) సూర్య భగవానుడిని పూజించి ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలని పండితులు  చెబుతున్నారు. 

సూర్యుడు పరమాన్న ప్రియుడు... అందుకే ఈ రోజు సూర్యుడికి ఎదురుగా తులసి కోట దగ్గర, కల్లాపి జల్లి ముగ్గులు వేసిన వారిలో నేల మీద ఆవు పిడకలు పేరుస్తారు. దాని మీద ఆవు పాలు, బెల్లం, కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు. చిక్కుడు ఆకుల్లో దాన్ని పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

చిక్కుడు కాయలతో రథాన్ని చేసి. అందులో ఎర్ర చందనాన్ని కలిపి తయారు చేసిన అక్షిం తలు ఉంచి సూర్యభగవానుడిని ఆవాహన చేస్తారు. సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు. అందుకే సూర్య జయంతి రోజు ఎర్రటి వస్త్రం. గోధుములు, బంగారం, ఎర్రటి పువ్వులు దానమివ్వాలని పెద్దలు చెబుతారు. 

ప్రత్యేక పూజలు 

రధసప్తమి రోజు సూర్యుడి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో, ఒడిశాలోని కోణార్క్, తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం చేస్తారు. అరసవెల్లిలో సూర్యనారాయణ ఆలయంలో  ఈ రోజు సూర్యుని కిరణాలు మూలవిరాట్టు పాదాలను తాకుతాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.