జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుని సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో సూర్యుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. జాతకంలో సూర్యుడు శుభ దృష్టి ఉంటే ఐశ్వర్యం.. అదృష్టం కలసి వస్తుందని చెబుతున్నారు. రథ సప్తమి ( జనవరి 25) రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
రథ సప్తమి అంటే అది మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి చేసే సంకల్పం. సూర్యుడు ఆరోగ్యానికి ఆత్మవిశ్వాసానికి కారకుడు. అందుకే ఈ రోజు చేసే దానాలు కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే జాతకంలో ఉన్న దోషాలను నివృత్తి చేసుకొనేందుకు ప్రతి రాశి వారు వారిజాతకం ఆధారంగా సూర్యుడు పుట్టిన రోజున.. అంటే రథసప్తమి ( జనవరి 25) కొన్ని వస్తువులను దానం చేయాలని చెబుతున్నారు.
- మేష రాశి: ఎర్రటి వస్త్రం, శనగలు బెల్లం దానం చేయడం వలన మనం చేసే పనుల్లో స్థిరత్వం కలుగుతుంది.
- వృషభ రాశి: బియ్యం, పాలు, చక్కెర , తెల్ల నువ్వులు దానం, తెల్ల బట్టలు దానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- మిథున రాశి: ఆకుపచ్చని దుస్తులు , డబ్బు, పసుపు, పాలు,పెసరపప్పు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.
- కర్కాటక రాశి: పాలు, తెల్లని వస్త్రాలు, బియ్యం, వెండి, తెల్ల నువ్వులు దానం చేయడం వలనమానసిక ప్రశాంతత లభిస్తుంది.
- సింహ రాశి: ఈ రాశికి అధిపతి సూర్యుడే కాబట్టి గోధుమలు, తేనే, చిక్కీ, దుప్పట్లు, బెల్లం దానం చేయడం వల్ల సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి.
- కన్యా రాశి: ఆకుపచ్చ కూరగాయలు .. గోవుకు ఆహారం.. పప్పు ధాన్యాలను దానం చేస్తే ఆరోగ్యానికి మంచిది.
- తులా రాశి: బియ్యం, తెల్లని వస్త్రాలు, పంచదార, బియ్యం, దుప్పటి,చక్కెర దానం చేయడం వలన విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పడుతాయి.
- వృశ్చిక రాశి: వేరుశనగ, బెల్లం, నువ్వులు,ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, శత్రు జయం లభిస్తాయి.
- ధనుస్సు రాశి: పసుపు రంగు వస్త్రాలు ..శనగపిండి, పప్పు ధాన్యాలను దానం చేస్తే జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి.
- మకరరాశి:నల్ల నువ్వులు .. లడ్డూ, దుప్పట్లు,నల్లని దుప్పటి, నూనె, నల్ల నువ్వులు, ఇనుప వస్తువుల దానం వల్ల శని ప్రభావం తగ్గి సూర్య శక్తి లభిస్తుంది.
- కుంభ రాశి: నల్ల నువ్వులు ..నల్లని వస్త్రాలు, తోలు బూట్లు, ఉసిరి పప్పు, కిచిడీ, నువ్వులు, బియ్యం.. శివాలయంలో నువ్వుల నూనె ఇవ్వడం వల్ల శని ప్రభావం తగ్గి సూర్య శక్తి లభించి అనుకున్న పనులు నెరవేరుతాయి.
- మీన రాశి: పసుపు ఆవాలు, శనగ పప్పు, వస్త్రాలు, బియ్యం, పప్పు, నువ్వులు, పసుపు పండ్లు .. పసుపు రంగు దుస్తుల దానం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతారు.
ఇంకా ఏమేమి చేయాలంటే
- తెల్లవారుజామునే నిద్రలేవాలి..
- జిల్లేడు ఆకులను ( మగవారు )తలపై పెట్టుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులను ( ఆడవారు )తలపై పెట్టుకొని స్నానం చేయాలి
- సూర్యనమస్కారాలు చేయాలి
- ఆదిత్యహృదయం.. సూర్యాష్టకం పఠించాలి.
- సూర్యుని ఎదురుగా నిలబడి దోసెలలో నీళ్లు పోసుకొని ఒక రాగి పాత్రలో వదలాలి. తరువాత ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టుకు పోయాలి..
- గోవుకు గోధుమలు ఆహారంగా ఇవ్వాలి.
- శివాలయాన్ని సందర్శించి.. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి.
రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. పైన పేర్కొన్న దానధర్మాలు మీ శక్తి కొలది చేయడం వల్ల మీ జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. ఈ శుభ సమయంలో చేసే భక్తి పూర్వక పనులు మీ జీవిత దిశను మార్చగలవు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
