మెల్బోర్న్: తనకు గొప్ప రికార్డు లేని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫెల్ నడాల్ రఫ్ఫాడించాడు. గెలవాలన్న కసి, టెన్నిస్ వరల్డ్‌లో ది బెస్ట్ అనిపించుకోవాలన్న పట్టుదలకు ఏజ్ ఏ మాత్రం అడ్డురాదని నిరూపించాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్, 35 ఏళ్ల నడాల్ 2-–6, 6-–7 (5/7), 6–-4, 6–-4, 7–-5తో 25 ఏళ్ల మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించి విన్నర్‌గా నిలిచాడు. దాంతో, చెరో 20 మేజర్ టైటిళ్లతో ఈక్వల్‌గా ఉన్న తన చిరకాల ప్రత్యర్థులు రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌ను దాటిన నడాల్ బిగ్3 ప్లేయర్లలో ఇప్పుడు టాప్‌లోకి వచ్చేశాడు. అలాగే, మెన్స్ సింగిల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను రెండేసి సార్లు గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నడాల్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫాకు ఇది సెకండ్ టైటిల్. 2009లో తొలిసారి గెలిచాడు. మరోవైపు పోయినేడాది జొకోవిచ్ చేతిలో ఓడిన డానిల్కు ఈ సారి నడాల్ చేతిలో చుక్కెదురైంది. 2013లో నడాల్–జొకోవిచ్ మధ్య ఫైనల్ (5:53 గంటలు) తర్వాత సెకండ్ లాంగెస్ట్ ఫైనల్‌గా నిలిచిన ఈ పోరులో (5:28 గంటలు)మెద్వెదెవ్ ఏకంగా 23 ఏస్‌లు కొట్టినా, నడాల్ కంటే ఎక్కువగా 76 విన్నర్లు, మొత్తంగా 189 పాయింట్స్ గెలిచినా ఫలితం లేకపోయింది. మూడే ఏస్‌లు కొట్టిన రఫెల్.. 69 విన్నర్లు, టోటల్‌గా 182 పాయింట్లు గెలిచాడు. డానిల్ ఐదు డబుల్ ఫాల్ట్స్, 52 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేస్తే నడాల్ 5 డబుల్ ఫాల్ట్స్ 68 ఎర్రర్స్ చేశాడు. కానీ,30 నెట్పాయింట్స్, 7 పాయింట్స్‌తో ముందంజ వేశాడు. మెద్వెదెవ్ 28 నెట్ పాయింట్స్, 6 బ్రేక్ పాయింట్లతో సరిపెట్టాడు. దాంతో, కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ నెగ్గాలన్న తన ఆశ నెరవేరలేదు.
పడి.. లేచి..పడగొట్టి..
నడాల్ ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్స్ గెలిచినప్పటికీ.. ప్రస్తుత ఫామ్, ర్యాంక్ పరంగా ఫైనల్లో మెద్వెదెవ్ ఫేవరెట్‌గా కనిపించాడు. అందుకు తగ్గట్టుగానే ఈ రష్యా స్టార్ టైటిల్ ఫైట్‌ను దూకుడుగా స్టార్ట్ చేశాడు. తనకంటే పదేళ్లు పెద్దోడైన నడాల్‌ను బలమైన సర్వీస్‌లు, కండ్లు చెదిరే ఏస్‌లు కొడుతూ బేస్‌లైన్ గేమ్‌తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఐదు, ఏడో గేమ్స్‌లో నడాల్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన డానిల్ ఫస్ట్ సెట్‌ను 42 నిమిషాల్లోనే సొంతం చేసుకున్నాడు. 82 నిమిషాల పాటు సాగిన సెకండ్సెట్ను టై బ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌లో 2–0తో లీడ్‌లోకి వచ్చాడు. కానీ, బ్రేక్ తర్వాత మూడో సెట్‌కు వచ్చిన రఫా ఆట పూర్తిగా మారింది. మిస్టేక్స్ చేయకుండా.. కంట్రోల్‌గా ఆడాడు. సర్వీస్‌లు, ర్యాలీల్లో సూపర్బ్‌గా ఆడుతూ తొమ్మిదో గేమ్ మెద్వెదెవ్ సర్వీస్ బ్రేక్ చేసిన తను నెక్ట్స్ గేమ్‌లో సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. అదే జోరుతో ఫోర్త్ సెట్ కూడా గెలిచాడు. ఇక, డిసైడర్ సెట్ ఐదో గేమ్‌లో డానిల్ సర్వీస్ బ్రేక్ చేసిన నడాల్ థ్రిల్లింగ్‌గా సాగిన తర్వాతి గేమ్‌లో తన సర్వీస్ కాపాడుకున్నాడు. తన సర్వీస్‌లో ఎనిమిదో గేమ్ కూడా గెలిచి 5–3తో ఈజీగా సెట్‌తో పాటు మ్యాచ్ నెగ్గేలా కనిపించాడు. కానీ, తర్వాతి గేమ్ నెగ్గిన మెద్వెదెవ్.. పదో గేమ్‌లో నడాల్ చాంపియన్‌షిప్ కోసం చేసిన సర్వ్‌ను బ్రేక్ చేసి 5–5తో స్కోరు ఈక్వల్ చేశాడు. దాంతో, మ్యాచ్‌లో టెన్షన్ పీక్కు చేరుకుంది. ఈ టైమ్‌లో తన ఎక్స్‌పీరియన్స్‌ను ఉపయోగించిన రఫా సూపర్‌గా ఆడగా.. వరుసగా రెండు ఎర్రర్స్‌తో డానిల్ సర్వీస్ కోల్పోయాడు. ఆపై, తన సర్వీస్‌లో వరుసగా నాలుగు పాయింట్లు గెలిచిన నడాల్ ఓ ఏస్, బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో మ్యాచ్‌ను ముగించి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు.
ఒక పక్క ఏజ్ పెరుగుతోంది. మరోపక్క గాయాలు వెంటాడుతున్నాయి. నెలన్నర కిందట మళ్లీ కోర్టులోకి వస్తాడో లేదో తనకే క్లారిటీ లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు రఫెల్ నడాల్ పరిస్థితి ఇది. ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తాడన్న వార్తలూ వచ్చాయి..! కానీ కెరీర్ స్టార్టింగ్ నుంచి పోరాటాన్నే నమ్ముకున్న నడాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్భుతమే చేశాడు..! తగ్గేదేలే అన్నట్టుగా ఒక్కో అడుగు వేస్తూ వచ్చిన రఫా ఫైనల్లో రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ పని పట్టాడు..! ఐదున్నర గంటల అల్టిమేట్ ఫైట్‌లో తనలోని బెస్ట్ ఆటను బయటకు తీసి ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు.! ఫస్ట్ రెండు సెట్లు కోల్పోయినా సూపర్బ్‌గా కమ్‌బ్యాక్ చేసి గెలిచిన ఈ స్పెయిన్ బుల్ రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ కొట్టి మెన్స్ సింగిల్స్‌లో ది గ్రేట్ ప్లేయర్ అనిపించుకున్నాడు..! మొత్తంగా మెల్బోర్న్లో సండే నైట్ స్టార్ట్ అయి మండే ఎర్లీ మార్నింగ్ వరకూ సాగిన ఈ హై ఓల్టేజ్ ఫైట్ టెన్నిస్ హిస్టరీలో నిలిచిపోవడం పక్కా!