
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం
- విద్యుత్ శాఖ మాజీ అధికారి రఘు
హైదరాబాద్: చత్తీస్ గఢ్ తో విద్యుత్ ఒప్పందాల వల్ల 2,600 కోట్ల రూపాయల నష్టం జరిగిందని విద్యుత్ శాఖ మాజీ అధికారి రఘు తెలిపారు. ఇవాళ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాలపై తమ వద్ద ఉన్న సమచారాన్ని కూడా అందించామని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ తో తొలుత వెయ్యి మెగావాట్ల సరఫరాకు ఒప్పందం జరిగితే అది సప్లయ్ కాలేదని, తర్వాత తెలుసుకొని మరో వెయ్యి మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు.
తరువాత తెలుసుకొని రద్దు చేసుకోవాలని ప్రయత్నిస్తే కుదరలేదన్నారు. చత్తస్ గఢ్ ఒప్పందం రెగ్యులెటరీ కమిషన్ ఒప్పదం పొందలేదని చెప్పారు. ఇరు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఎంవోయూ చేసుకున్నాయని చెప్పారు. బీహెచ్ఈఎల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ లో 2013-2014 88శాతం ఉంటే తర్వాత జీరోకు పడిపోయిందని చెప్పారు. మూడేళ్లలో పూర్తి కావాల్సిన యాదాద్రి ప్లాంట్ తొమ్మిదేండ్లయినా పూర్తి కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీహెచ్ఈఎల్ సబ్ క్రిటికల్ టెక్నాలజీని రుద్దిందని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం వాడిన యంత్రాలు సరైనవి కావదని అన్నారు. గోదావరిలో ఫ్లడ్ ఎక్కువైతే పవర్ ప్లాంట్ పై ప్రభావం పడుతుందని చెప్పారు. సాంకేతిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల రవాణా చార్జీల భారం పడుతుందని చెప్పారు. ఈ విషయాలన్నీ కమిషన్ కు వివరించినట్టు చెప్పారు.