తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘునందన్ రావు

తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా  రఘునందన్ రావు


తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. గెలిచిన వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు తప్ప.. క్రీడాకారుల శిక్షణకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటంలేదని విమర్శించారు. తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రఘునందన్ రావు.. ఇవాళ ఎల్బీ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు నిధుల విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు రఘునందన్. తెలంగాణలో జిమ్నాస్టిక్స్ కు ప్రాధాన్యత తీసుకొచ్చేలా పని చేస్తానన్నారు.