నేటినుంచి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు

నేటినుంచి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు స్వేచ్ఛ ఇచ్చేందుకే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సభ్యలు తెలిపారు.  

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేత్రుత్వంలో ఈ ప్లీనరీ ప్రారంభమయింది. సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలా? లేదా అనే అంశంపై స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.  ఏఐసీసీ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను స్టీరింగ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. సాయంత్రం 4 గంటలకు ముసాయిదా తీర్మానాలను ఖరారు చేసే అంశంపై వివిధ కమిటీల సమావేశమై ఖరారు చేయనుంది. 

రేపు ( ఫిబ్రవరి 25) రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తీర్మానాల పై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 26న వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సంబంధించిన తీర్మానాలు, సామాజిక న్యాయం, సాధికారత, యువత, ఉపాధి, విద్యపై ప్లీనరీలో చర్చలు జరుగుతాయి. చర్చలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రసంగం, సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు.