ఈ ఫైనల్లో నలుగురు అన్నదమ్ములు బరిలో నిలిచారు. హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా ముంబైకి టైటిల్ అందించడంపై దృష్టి పెట్టగా.. దీపక్ చహర్, రాహుల్ చహర్ మాత్రం ప్రత్యర్థులుగా మైదానంలోకి రానున్నారు. సీజన్లో నిలకడగా ఆడుతున్న ఈ ఇద్దరు తమ జట్లలో కీలక ప్లేయర్లుగా మారారు. దీపక్ చహర్ (16 ఇన్నింగ్స్‌ల్లో 20 వికెట్లు) చెన్నై పేస్ విభాగాన్ని నడిపిస్తుండగా..
రాహుల్ (12 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు) ముంబై స్పిన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. పవర్‌ప్లే, స్లాగ్ ఓవర్లలో దీపక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే.. తమ్ముడు రాహుల్ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థుల పని పడుతున్నాడు. మరి, ఫైనల్లో పైచేయి ఎవరిదో చూడాలి.