సాహా వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్

సాహా వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధి మాన్ సాహా వ్యాఖ్యలకు తాను భాదపడటం లేదన్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.  సౌతాఫ్రికా పర్యటన తర్వాత రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని సూచించినట్లు సాహా ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్ సాహా వ్యాఖ్యలకు తానేమీ బాధపడటం లేదన్నాడు.  భారత జట్టుకు అతను అందించిన సేవలకు గౌరవం ఉందన్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అతడికి క్లారిటీ ఉండాలనే తాను అలాంటి వ్యాఖ్యలు చేశానన్నాడు. క్రికెట్ లో సున్నితంగా ఉంటే సరిపోదని.. కొన్ని సార్లు ఆటగాళ్లతో కఠినమైన విషయాలు చర్చకు వస్తాయన్నాడు. ప్రతి ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదనే విషయంపై తాను క్లారిటీ ఇస్తానని చెప్పాడు ద్రవిడ్. కొన్ని రోజుల తర్వాత వాళ్లు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు వివరణ ఇచ్చాడు ద్రవిడ్