రాహుల్ ద్రవిడే.. గ్రేటెస్ట్..!

రాహుల్ ద్రవిడే.. గ్రేటెస్ట్..!

ఫార్మాట్ ఏదైనా.. వరల్డ్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఓ ఎవరెస్ట్..! అతను సాధించిన రికార్డులు.. రివార్డులు.. రన్స్.. అచీవ్‌‌మెంట్స్‌‌ మరెవరూ సాధించలేదు..! కానీ ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం.. బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌‌మన్‌‌ ఎవరంటే.. మాస్టర్ కాదంటున్నారు..! టెస్ట్‌‌ ఫార్మాట్‌‌లో అత్యుత్తమ బ్యాట్స్‌‌మన్‌‌గా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌‌కు పట్టం కట్టారు..! ఓటింగ్‌‌లో ద్రవిడ్ స్వల్ప తేడాతో సచిన్‌‌ను ఓడిస్తే.. లెజెండరీ సునీల్ గావస్కర్.. కింగ్ కోహ్లీని వెనక్కి నెట్టేసి మూడో ప్లేస్‌‌ను సొంతం చేసుకున్నాడు..!!

న్యూఢిల్లీ: అత్యుత్తమ టెక్నిక్.. అత్యద్భుతమైన డిఫెన్స్.. అలుపెరగని ఆట.. టన్నుల కొద్ది ఓపిక.. ఇలా చెప్పుకుంటూ పోతే వరల్డ్ టెస్ట్ క్రికెట్‌‌‌‌లో రాహుల్ ద్రవిడ్ ఓ సూపర్ ఐకాన్‌‌‌‌గా నిలుస్తాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు జనాలు కూడా అంగీకరిస్తున్నారు. అంగీకరించడమే కాదు.. ఓట్ల రూపంలో తమ అభిమానాన్ని చూపెట్టారు. ఇండియాలో ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ ఎవరని? విజ్డెన్ ఇండియా ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ఓ పోల్ నిర్వహించింది. క్రికెట్ ఓ మతమైతే.. సచిన్‌‌‌‌ను దేవుడిగా చూసే మన దగ్గరే.. గ్రే‘టెస్ట్’ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా ఫస్ట్ టైమ్ ద్రవిడ్‌‌‌‌కు అత్యధిక ఓట్లు వేశారు. ఈ పోల్ కోసం టీమిండియా టెస్ట్ హిస్టరీ నుంచి మొత్తం 16 మంది బెస్ట్ ప్లేయర్లను ఎంపిక చేశారు.

అనేక వడపోతల తర్వాత ద్రవిడ్, సచిన్, గావస్కర్, కోహ్లీ.. ఫైనల్–4లో నిలిచారు. వీరి మధ్య ఓటింగ్ రేస్ హోరాహోరీగా సాగింది. కొద్దిసేపు ద్రవిడ్, గావస్కర్, మరికొద్దిసేపు సచిన్, కోహ్లీ మధ్య పోటీ నడిచింది. మొత్తం 11,400 ఓట్లు పోలవగా అందులో 52 శాతం దక్కించుకున్న ద్రవిడ్‌‌‌‌ చివరకు టాప్‌‌‌‌లో నిలిచాడు. ‘మంగళవారం ఉదయం వరకు ద్రవిడ్ 42 శాతంతో వెనుకబడి ఉన్నాడు. కానీ ఈ రోజు అనూహ్యంగా టాప్‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. ద్రవిడ్ బ్యాటింగ్ తరహాలోనే ఓటింగ్ కూడా సాగడం విశేషం. మొదట స్లో.. తర్వాత పుంజుకుని రేస్‌‌‌‌లోకి వచ్చాడు. చివరి వరకు వచ్చేసరికి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న సచిన్ స్వల్ప తేడాతో రెండో ప్లేస్‌‌‌‌కు పరిమితమయ్యాడు’ అని విజ్డెన్ ఇండియా పేర్కొంది. మూడో ప్లేస్‌‌‌‌కు జరిగిన ఓటింగ్‌‌‌‌లో గావస్కర్.. కోహ్లీని వెనక్కి నెట్టేశాడు.

ఇద్దరూ… ఇద్దరే

వరల్డ్ ఆల్‌‌టైమ్‌‌ లిస్ట్‌‌లో సచిన్, ద్రవిడ్ అత్యుత్తమ బ్యాట్స్‌‌మెన్‌‌ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. టెస్ట్, వన్డేల్లో ఇద్దరూ 10 వేలకు పైగా రన్స్ చేశారు. ఐదు రోజుల ఫార్మాట్‌‌లో ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. ఆట, ఆలోచనా తీరు కూడా పూర్తిగా భిన్నం. అపోజిషన్ బౌలర్లు విసిగి వేసారిపోయేలా చేసిన తర్వాత రన్స్ సాధించడం ద్రవిడ్ స్టైల్. గంటల కొద్దీ క్రీజులో ఉండటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అదే టెండూల్కర్ బిగ్ స్ట్రోక్ మేకర్. ఎదుటి బౌలర్ ఎంతటి మేటి అయినా.. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో బీభత్సం సృష్టిస్తాడు. అయితే ఇద్దరిలో ఒక్క సారూప్యత మాత్రం ఉంది. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక వీళ్లను ఔట్ చేయడం ప్రత్యర్థి బౌలర్లకు కత్తిమీద సామే. డిఫరెంట్ పాయింట్స్‌‌లో రన్స్ రాబట్టడంలో ఎవరికిరి వారే దిట్ట. ఇద్దరూ కెప్టెన్లుగా పని చేశారు. ఒకరి సారథ్యంలో మరొకరు అద్భుతంగా ఆడారు. ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా కలిసి కెరీర్‌‌ను నిర్మించుకున్నారు. అయితే అన్ని ఫార్మాట్లలో సచిన్ వేగంగా ఆడటంతో.. ఎక్కడా టెస్ట్ బ్యాట్స్‌‌మన్‌‌ అనే ముద్ర పడలేదు. కానీ స్లో అండ్ స్టడీ ఆటతీరు వల్ల మిస్టర్ డిపెండబుల్‌‌కు ‘టెస్ట్ ప్లేయర్’ అనే బిరుదు వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం