
ఇటాలియన్ పత్రిక(కోరియర్ డెల్లా సెరా)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదో తెల్వదు కానీ..పిల్లలు కావాలనుందని వ్యాఖ్యానించారు.
ఇంటర్వ్యూలో ఇంత వరకు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని రాహుల్ ను అడిగితే..‘ ఆశ్యర్యంగా ఉంది. పెళ్లి ఎందుకు చేసుకోలేదో నాకు కూడా అర్థం కావడం లేదు. చాలా పనులు చేయాల్సి ఉంది. కానీ నాకు పిల్లలు కావాలని ఉంది.’ అని వ్యాఖ్యానించారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర అనుభవాలను కూడా రాహుల్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీసుకోకూడదనుకున్నానని చెప్పారు. అయితే గడ్డం తీసుకోవాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. నాన్నమ్మ ఇందిరాగాంధీకి తనంటే ఎంతో ఇష్టమని.. ఇటలియన్ అమ్మమ్మ పావ్ లామాయినోకు సోదరి ప్రియాంక గాంధీ అంటే ఇష్టమని తెలిపారు.