హైదరాబాద్ లో ఉండొద్దు... ప్రజల్లో తిరగండి

హైదరాబాద్ లో ఉండొద్దు... ప్రజల్లో తిరగండి

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా హైదరాబాద్ లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేషం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలన్న ఆయన...ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. నేతలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువకులు, కార్మికులు... ఇలా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో ఎంతటి సీనియర్ లీడర్లైనా సరే... పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని పదే పదే గుర్తు చేశారు. కష్టపడి పని చేసిన వాళ్లకి మెరిట్ ప్రాతిపదికన టిక్కెట్లు లభిస్తాయన్నారు. అంతర్గత విబేధాలకు స్వస్తి పలికి... ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 300 మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తల కోసం...

వాళ్లేదో రాసిస్తే.. ఆయనేదో చదివిపోయిండు

NSUI నేతలకు రాహుల్,కాంగ్రెస్ నేతల పరామర్శ