NSUI నేతలకు రాహుల్,కాంగ్రెస్ నేతల పరామర్శ

NSUI నేతలకు రాహుల్,కాంగ్రెస్ నేతల పరామర్శ

చంచల్ గూడ జైలులో  NSUI నేతలను పరామర్శించారు రాహుల్ గాంధీ. NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 17మంది NSUI నేతలను పరామర్శించారు. రాహుల్ వెంట మాణిక్క ఠాగూర్, రేవంత్, ఉత్తమ్, భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.  రాహుల్ రాకతో.. చంచల్ గూడ జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. NSUI నేతలను కలిసి తర్వాత గాంధీ భవన్ కు వెళ్తారు రాహుల్. గాంధీభవన్ లో పీసీసీ నేతలతో సమావేశమై.. పార్టీ అంశాలపై చర్చిస్తారు. 2గంటల 45 నిమిషాలకు మెంబర్షిప్ కోఆర్డినేటర్లతో భేటీ అవుతారు. సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళతారు రాహుల్.అంతకు ముందు నెక్లస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో.. మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించారు రాహుల్ గాంధీ. పార్టీ నేతలతో కలిసి హోటల్ తాజ్ కృష్ణ నుంచి సంజీవయ్య పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్.. నిన్న వరంగల్ సభలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను పరామర్శించారు. రైతు డిక్లరేషన్ ను ప్రకటించి.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తితో పొత్తుల ఉండబోవని స్పష్టం చేశారు. వరంగల్ నుంచి రాత్రి హైదరాబాద్ చేరుకున్న రాహుల్ తాజ్ కృష్ణా హోటల్ లో బస చేశారు. ఉదయం హోటల్ తాజ్ కృష్ణాలో ఉద్యమ నేతలతో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. గద్దర్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్.పురుషోత్తమ్, జహీర్ అలీ ఖాన్, చెరుకు సుధాకర్, అడ్వకేట్ జేఏసీ వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ జానయ్య, కంచె అయిలయ్య, మురళీ మనోహర్, ప్రొఫెసర్ హరగోపాల్ రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరయ్యారు. బెల్లయ్య నాయక్, వరంగల్ రవి కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా ఉద్యమాలు, సమస్యలపై ఉద్యమ నేతలతో చర్చించారు రాహుల్.