వాళ్లేదో రాసిస్తే.. ఆయనేదో చదివిపోయిండు

వాళ్లేదో రాసిస్తే.. ఆయనేదో చదివిపోయిండు

రాహుల్ గాంధీకి వడ్లు తెల్వదు..ఏం తెల్వదని..వాళ్లేదో రాసిస్తే చదవిపోయిండన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా సంగెం-గీసుకొండ మధ్య నిర్మిస్తున్న మెగా టెక్స్ టైల్ పార్క్ కి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. దీనితో పాటు ఈకో టెక్స్ టైల్ పార్క్ ని ప్రారంభించారు. తర్వాత మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మట్లాడిన కేటీఆర్.. రాహుల్ కు వడ్లు తెల్వకున్నా వాళ్ళేదో రాసిస్తే..ఆయనొచ్చి చదివిపోయిండన్నారు. మొన్న మహబూబ్ నగర్ లో ఒకాయన. నిన్న వరంగల్ లో ఒకాయన అవగాహన లేకుండా మాట్లాడారన్నారు.  పొలిటికల్ టూరిస్టులు వస్తరు..పోతరన్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.వాళ్లతో ఊదు కాలదు, పీరి లేవదన్నారు. మన ప్రభుత్వం చేసిన పనులు చెబితే చాలన్నారు. గ్యాస్ ధర మళ్లీ పెంచారన్నారు.  కైటెక్స్ కంపెనీలో 1600 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. 16వేల మందికి ఉపాధి రానుందన్నారు. కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ లో 20కంపెనీలు వస్తాయన్నారు.  భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్లాస్టిక్ నుంచి బట్టలు తయారు చేసే కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు.