ఇండియా యువతకు ఉద్యోగాలు కల్పించలేదు: రాహుల్ గాంధీ

ఇండియా యువతకు ఉద్యోగాలు కల్పించలేదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీతోపాటు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. కరోనాను ఎదుర్కోవడం, చైనాతో లడఖ్‌లో ఘర్షణలు లాంటి విషయాలపై మోడీని టార్గెట్‌ చేసుకొని రాహుల్ పలుమార్లు విమర్శలకు దిగారు. తాజాగా ఉద్యోగాల విషయంలో మోడీపై రాహుల్ కామెంట్స్ చేశారు. యువతకు ఇండియా ఉద్యోగాలు కల్పించలేదన్నారు.

‘కరోనా వల్ల దేశంలో భారీ నష్టం సంభవించనుందిని నేను హెచ్చరించినప్పుడు మీడియా నన్ను ఎగతాళి చేసింది. మన దేశం జాబ్స్ కల్పించలేదని ఇవ్వాళ నేను చెబుతున్నా. మీరొక వేళ ఒప్పుకోకపోతే 6–7 నెలలు వేచి చూడండి’ అని రాహుల్ ఓ వీడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. గత నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ రెండు కోట్ల కుటుంబాల భవిష్యత్ చీకటిలో ఉంది. ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్‌, ద్వేషాన్ని ప్రచారం చేసినంత మాత్రాన నిరుద్యోగికత, ఆర్థిక వ్యవస్థ విధ్వంసంపై నిజాలు దేశ ప్రజలకు తెలియకుండా దాగవు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.