
కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోనసాగుతోంది. పన్నెండో రోజు అలప్పుజాలోని పునప్ర ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించేందుకు ముందు స్థానికంగా ఉన్న మత్స్యకారులతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఇంధన ధరల పెరుగుదల, చేపలు నిల్వచేసే టెక్నాలజీ, విద్యాహక్కు ఇంకా దేశంలో పెద్ద సవాళ్లుగా మిగిలిపోయాయన్నారు.
మొత్తం 19 రోజులపాటు కేరళలో జోడో యాత్రజరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రాహుల్ యాత్ర ఎర్నాకుళం జిల్లాకు.. 23న త్రిస్సూర్ చేరుకోనుంది. సెప్టెంబర్ 26, 27న పాలక్కడ్, 28న మలప్పురంలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. కేరళలోని 7 జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. అక్టోబర్ 1న కర్ణాటకలోకి యాత్ర ప్రవేశిస్తుంది.
Kerala | Congress MP Rahul Gandhi along with party leaders & workers resumes 'Bharat Jodo Yatra' on its 12th day in Punnapra Aravukad, Alappuzha pic.twitter.com/1BNpRDil6r
— ANI (@ANI) September 19, 2022