
- కరోనాపై పోరాటంలో మోడీకి సహకరిస్తాం:రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు కొత్త పరిష్కార మార్గాలు కనుగొనాలని రాహుల్ గాంధీ అన్నారు. “కరోనా మనకు పెద్ద సవాలుగా నిలిచింది. ఇది ఒక మంచి అవకాశం కూడా. మన సైంటిస్టులు, ఇంజనీర్లు, డేటా ఎక్స్ పర్ట్స్ ద్వారా ఈ క్రైసిస్ కు కొత్త పరిష్కారం కనుగొనాలి” అని శనివారం ట్వీట్ చేశారు. కరోనాపై పోరాటానికి మన దగ్గర ఉన్న పెద్ద ఆయుధం టెస్టింగ్ మాత్రమేనని అన్నారు. మనం వైరస్ ను వెంటాడుతున్నామని, అయితే టెస్టింగ్ రేట్ తక్కువగా ఉందని చెప్పారు. వెంటనే ర్యాపిడ్ టెస్టింగ్ లను పెంచాలని డిమాండ్ చేశారు. టెస్టుల సంఖ్య పెంచుకపోతే మరోసారి లాక్ డౌన్ భరించక తప్పదని హెచ్చరించారు. కరోనాపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.