ప్రజలకు ఏం కావాలో మోడీకి అర్థం కాదు

ప్రజలకు ఏం కావాలో మోడీకి అర్థం కాదు

తన ఫ్రెండ్స్ ​మాటలు తప్ప మరేం వినలేరు: రాహుల్

న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’ కింద సాయుధ దళాల్లో షార్ట్ సర్వీస్ రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయాలని, నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ డిమాండ్​ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ లీడర్​ రాహుల్ ​గాంధీ మోడీపై ఫైర్​ అయ్యారు. తన స్నేహితుల మాటలు తప్ప మరేమీ వినలేని ప్రధాని మోడీకి దేశ ప్రజలకు ఏం కావాలో అర్థం కావడం లేదన్నారు. కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంపై రాహుల్ స్పందించారు. కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. నిరసనలు, ఆందోళనలతో అగ్నిపథ్​ను యువకులు వ్యతిరేకిస్తున్నందున దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీని కోరారు.