అమెరికా టారీఫ్ లతో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ షట్‌‌‌‌‌‌‌‌డౌన్..మోదీ పట్టించుకోవట్లేదు: రాహుల్ గాంధీ

అమెరికా టారీఫ్ లతో  టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్  షట్‌‌‌‌‌‌‌‌డౌన్..మోదీ పట్టించుకోవట్లేదు: రాహుల్ గాంధీ
  • ఫ్యాక్టరీలు మూతపడుతున్నయ్: రాహుల్ 
  • అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో ఈ రంగం దెబ్బతిన్నది
  • ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఫైర్


న్యూఢిల్లీ: అమెరికా విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌లతో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ కంపెనీలు మూతపడుతున్న ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల హర్యానాలోని గార్మెంట్ ఫ్యాక్టరీని రాహుల్ సందర్శించారు. ఆ వీడియోను శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో పోస్టు చేశారు. ‘‘అమెరికా విధించిన 50% టారిఫ్‌‌‌‌‌‌‌‌లు, మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అనిశ్చితి కారణంగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు పోతున్నయ్.. ఫ్యాక్టరీలు షట్‌‌‌‌‌‌‌‌డౌన్ అవుతున్నయ్.. ఆర్డర్లు తగ్గుతున్నయ్.. మన డెడ్‌‌‌‌‌‌‌‌ ఎకానమీకి ఇదే నిదర్శనం. టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ రంగ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టడం లేదు. కనీసం టారిఫ్‌‌‌‌‌‌‌‌ల గురించి మాట్లాడడం లేదు. 

లక్షలాది కోట్ల వ్యాపారాలు, 4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డా.. ప్రధాని మౌనంగా ఉంటున్నారు. మోదీజీ.. దీనికి మీరే బాధ్యత వహించాలి. ఇకనైనా ఈ సమస్యపై దృష్టిపెట్టండి” అని పోస్టులో రాహుల్ పేర్కొన్నారు. దీనికి #TINA (దేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజ్ నో అకౌంటెబిలిటీ) అనే హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను జోడించారు. ‘‘మన దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఇండస్ట్రీనే. మన బట్టలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. మనవాళ్ల నైపుణ్యం నిజంగా అద్భుతం. కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌లు, యూరప్‌‌‌‌‌‌‌‌లో ధరలు తగ్గడం, బంగ్లాదేశ్, చైనా నుంచి పోటీ పెరగడం.. ఇలా అన్ని వైపులా నుంచి మన టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలు పోతున్నయ్.. ఫ్యాక్టరీలు క్లోజ్ అవుతున్నయ్.. కొనుగోళ్లు తగ్గుతున్నయ్.. ఇండస్ట్రీ మొత్తం ఆగమాగమవుతున్నది. అయినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రీకి రిలీఫ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేలా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు” అని మండిపడ్డారు.

మీ మైండే షట్‌‌‌‌‌‌‌‌డౌన్ అయింది: గిరిరాజ్ సింగ్ 

రాహుల్ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని సెంట్రల్ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. దేశంలో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ తగ్గడం లేదని, మరింత విస్తరిస్తున్నదని ఆయన తెలిపారు. ‘‘టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఫ్యాక్టరీలు షట్‌‌‌‌‌‌‌‌డౌన్ కావడం లేదు. కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఎగుమతులు రూ.95 వేలు కోట్లు ఉంటే, 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ పీరియడ్‌‌‌‌‌‌‌‌లో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఎగుమతులు రూ.1.02 లక్షల కోట్లకు పెరిగాయి. గత 11 ఏండ్లలో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ రంగంలో 5 కోట్ల మందికి ఉపాధి కల్పించాం. అసత్యాలు చెప్పడం ఆపండి.. టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఇండస్ట్రీ పరుగులు పెడుతున్నది.. మీ మైండ్‌‌‌‌‌‌‌‌నే షట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో ఉంది” అని రాహుల్‌‌‌‌‌‌‌‌ను విమర్శించారు.