ఆర్ఎస్ఎస్‌‌లో అలాంటివేవీ లేవు

ఆర్ఎస్ఎస్‌‌లో అలాంటివేవీ లేవు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను సంఘ్ పరివార్‌గా పిలవడం సరికాదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఓ కుటుంబంలో ఉండే మహిళలు, పెద్దలకు గౌరవం ఇవ్వడం, అనుబంధాలు-ఆప్యాయతలు లాంటివేవి సంఘ్ పరివార్‌‌లో మచ్చుకు కూడా కనిపించవని రాహుల్ కామెంట్ చేశారు. ఆర్ఎస్ఎస్‌‌ను ఇకపై సంఘ్ పరివార్‌గా తాను పిలవనని స్పష్టం చేశారు. ‘ఆర్ఎస్ఎస్‌తోపాటు దాని అనుబంధ సంస్థలను సంఘ్ పరివార్‌‌గా పిలుస్తారు. కానీ దీనికి నేను ఒప్పుకోను. అలా పిలవడం సరికాదనిపిస్తోంది. ఇకపై ఆర్ఎస్ఎస్‌‌ను సంఘ్ పరివార్‌‌గా పిలవను’ అని రాహుల్ ట్వీట్ చేశారు.