బీజేపీ ప్రభుత్వమే విద్వేష వాతావరణాన్ని సృష్టించింది

బీజేపీ ప్రభుత్వమే విద్వేష వాతావరణాన్ని సృష్టించింది

మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో కోపం, ద్వేశపూరిత వాతావరణాన్ని కేంద్రం సృష్టించిందని ఆరోపించారు. ఇందులో నుపుర్ శర్మ ఒక వ్యక్తి మాత్రమేనన్నారు. నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థించారు.  దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులకు ప్రధాని మోడీ, హోంమంత్రి, బీజేపీ, అర్ఎస్ఎస్ కారణమని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వమే విద్వేశ వాతావరణనాన్ని సృష్టించిందని చెప్పారు. ఇది దేశానికి, దేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరమైందని రాహుల్ గాంధీ  ఆందోళన వ్యక్తం చేశారు.  అటు వయనాడ్లోని తన కార్యాలయంపై జరిగిన దాడిని రాహుల్ గాంధీ ఖండించారు. ఇది తన కార్యాలయం కాదని...వయానాడ్ ప్రజలదన్నారు. 

మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో..దేశంలో అల్లర్లు చెలరేగాయాని  సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నుపూర్ శ‌ర్మ చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యల వల్లనే దేశంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చీప్ పబ్లిసిటీ, రాజకీయ ఎజెండాలో భాగంగానే అలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.