గంగా మాతతో కన్నీళ్లు పెట్టించారు

గంగా మాతతో కన్నీళ్లు పెట్టించారు

న్యూఢిల్లీ: పవిత్ర గంగా మాతను ప్రధాని మోడీ ఏడ్పించారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కరోనాతో మృతి చెందిన శవాలు గంగా నదిలో ప్రవహిస్తున్నా మోడీకి కనిపించడం లేదని విమర్శించారు. ఎవరైతే తమను గంగా నది పిలిచిందని అన్నారో.. ఇప్పుడు వారే గంగా మాతతో కన్నీళ్లు పెట్టిస్తున్నారని మోడీని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు. గంగా నది తీరం వెంబడి 2 వేలకు పైగా శవాలు కొట్టుకు వచ్చాయన్న వార్తతో కూడిన ఆర్టికల్‌ను ఈ ట్వీట్‌కు రాహుల్ జత చేశారు. 

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ పైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరి సమస్యను మరింత జటిలం చేసే విధంగా ఉందన్నారు. 'కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ సమస్యను మరింత పెంచే విధంగా ఉంది. దీన్ని భారత్ సహించలేదు. టీకాలను కేంద్రమే కొనాలి. వ్యాక్సిన్ పంపిణీ బాధ్యతను మాత్రం రాష్ట్రాలకు వదిలేయాలి' అని రాహుల్ సూచించారు.