నాన్నమ్మ నైజం..అమ్మ సుగుణం ఉన్న అమ్మాయితే ఓకే: రాహుల్ గాంధీ

నాన్నమ్మ  నైజం..అమ్మ సుగుణం ఉన్న అమ్మాయితే  ఓకే: రాహుల్ గాంధీ

జీవిత భాగస్వామి ఎలా ఉండాలన్న అంశంపై కాంగ్రెస సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీలోని సుగుణాలతో కూడిన అమ్మాయి అయితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపారు. అమ్మ, నానమ్మలోని లక్షణాలు ఉన్న మహిళ అయితే మంచిదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేపట్టిన  భారత్‌ జోడో యాత్ర వెస్ట్ బెంగాల్ లో ఎంటరైంది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

కార్లంటే నచ్చదు..

తనకు కార్లంటే అంతగా ఇష్టం ఉండదని రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్పటికీ సొంత కారు కూడా లేదన్నారు. ఇంట్లో సీఆర్‌-వీ ఉందని..అందులో అమ్మ ప్రయాణిస్తుందని చెప్పారు. కార్లు నచ్చకపోయినా..వాటిని రిపేర్ మాత్రం చేస్తానన్నారు. కార్లలో వచ్చే సాంకేతిక సమస్యలు తనకు 90శాతం వరకు తెలుసన్నారు. 

బైక్ పై వెళ్లేందుకు ఇష్టపడతా..

సైక్లింగ్ చేయడం, బైకులంటే తనకు ఎంతో ఇష్టమని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఎన్ ఫీల్డ్ నచ్చదన్నారు. బైక్స్ బ్రేకులు, బ్యాలెన్స్ చేయడం అంటే మహా సరదా అని తెలిపారు. తనకు R1 కంటే ఎక్కువగా ఓల్డ్‌ లాంబ్రెట్టాను నడపడమంటే ఎక్కువ ఇష్టమన్నారు. లండన్‌లో ఉన్నప్పుడు అప్రిలియా ఆర్‌ఎస్‌ 250 బైక్‌ ఉండేదని..అదంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. బైక్ లపై  వేగంగా దూసుకెళ్లే ఆలోచనను ఇష్టపడతానని చెప్పారు.

తిట్టే వాళ్లు తిట్టనీ..డోంట్ కేర్..

తనను ఎంత మంది తిట్టినా..పప్పు అని విమర్శించినా..తాను మాత్రం ఎవరిని ద్వేషించనని రాహుల్ గాంధీ చెప్పారు. తనను తిట్టే వారి జీవితంలో బంధుత్వాలు లేక..బాధపడుతూ..ఎదుటి వారిని విమర్శిస్తుంటారని..అయినా పర్వాలేదన్నారు. తనను ఎంత తిట్టినా స్వాగతిస్తానని..ఎన్ని పేర్లు పెట్టినా లెక్కచేయనని చెప్పారు.