రాహుల్ గాంధీతో భేటీ...పొంగులేటి, జూపల్లి చేరికపై క్లారిటీ

రాహుల్ గాంధీతో భేటీ...పొంగులేటి, జూపల్లి చేరికపై క్లారిటీ

తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల్లోకి చేరికలు, రాజీనామాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు పెరిగాయి. కర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజయం రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ పెంచింది. ఈ నేప‌థ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయైమంది. 

రాహుల్ గాంధీతో సమావేశం..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అరగంటకు పైగా సాగిన భేటీలో   వీరిద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరిద్దరిని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. ఈ భేటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకా చౌదరి,  ఎమ్మెల్సీ గుర్నాధరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ముద్దప్ప దేశ్ ముఖ్, అన్నే కిష్టప్ప పాల్గొన్నారు. 

చేరేది ఎప్పుడుంటే..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారన్న దానిపై క్లారిటీ వచ్చింది. వీరిద్దరు జూలై 2వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుతారని సమాచారం. ఈ  సభకు రావాలని రాహుల్ గాంధీని  టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. ఆ సభలో పొంగులేటి, జూపల్లితో పాటు...భారీ సంఖ్యలో నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. 

ALSO READ:రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ

ఆనందంగా ఉంది..

తెలంగాణ కాంగ్రెస్లో ఘర్ వాపసీ జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. నేతలంతా తిరిగి కాంగ్రెస్లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో అన్న నినాదంతో తెలంగాణలో ముందుకెళ్లి..అధికారంలోకి రావాలని నేతలకు రాహుల్ గాంధీ సూచించారు.