కేంద్రానిది దేశద్రోహమే

కేంద్రానిది దేశద్రోహమే
  • కేంద్రానిది దేశద్రోహమే..
  • బార్డర్​లో చైనా నిర్మాణాలపై రాహుల్​ గాంధీ

న్యూఢిల్లీ: ఇండియా బార్డర్​లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా మోడీ సర్కార్​ పట్టించుకోవడం లేదని, ఇది దేశ ద్రోహం కిందికే వస్తుందని కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ విమర్శించారు. భారత్​ భూభాగాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, లడఖ్​లో చైనా ఆర్మీ , ఇన్​ఫ్రా డెవలప్​మెంట్​ చేస్తోందని అమెరికా టాప్​ జనరల్ ​తెలియజేసినా నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాడులకు చైనా పునాదులు వేస్తోందని మండిపడ్డారు. చైనా అక్రమ నిర్మాణాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చీ స్పష్టత ఇచ్చారు. తూర్పు లడఖ్​లో నెలకొన్న ఇష్యూలపై సొల్యూషన్స్​ కోసం భారత్​ ప్రభుత్వం చైనాతో చర్చలు జరుపుతోందన్నారు. చైనా ఆర్మీతో చర్చలు ప్రారంభమైతే.. అన్ని సమస్యలపై మాట్లాడతామని చెప్పారు.