
- రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ నివాళి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం నివాళులర్పించారు. ‘నిజమైన దేశభక్తుడి కుమారుడిగా గర్వపడుతున్నాను’ అని హృదయపూర్వక సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘‘నిజమైన దేశభక్తుడికి కొడుకు కావడం గర్వకారణం. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతతో సెల్యూట్ చేస్తున్నా”అని ట్వీట్ లో పేర్కొన్నారు.
నివాళులర్పించిన పీఎం మోడీ
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ‘‘మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీకి నివాళులు”అని గురువారం ట్వీట్ చేశారు.
రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20 న జన్మించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత.. రాజీవ్ గాంధీ 1984 లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇండియా 6 వ ప్రధాన మంత్రిగా( నెహ్రూ ఫ్యామిలీ నుంచి మూడవ వ్యక్తి) బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్ల వయసులో ప్రధాని అయిన రాజీవ్.. మన దేశంలో అతి పిన్న వయస్సు ప్రధానిగా రికార్డుకెక్కారు. 1991 మే 21 న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని శ్రీలంకకు చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) ఆత్మాహుతి దళం హత్య చేసింది.
एक सच्चे देशभक्त,उदार और परोपकारी पिता के पुत्र होने पर मुझे गर्व है।प्रधानमंत्री के रूप में राजीव जी ने देश को प्रगति के पथ पर अग्रसर किया।अपनी दूरंदेशी से देश के सशक्तीकरण के लिए उन्होंने ज़रूरी कदम उठाए।आज उनकी पुण्यतिथि पर मैं स्नेह और कृतज्ञता से उन्हें सादर नमन करता हूँ। pic.twitter.com/aDdKMf74wK
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2020