ఊటీలో రాహుల్​ సందడి.. గిరిజనులతో కలిసి డ్యాన్స్

ఊటీలో రాహుల్​ సందడి.. గిరిజనులతో కలిసి డ్యాన్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తమిళనాడులో పర్యటించారు. శనివారం రోజు (ఆగస్టు 12న) ఊటీకి వెళ్లిన ఆయన అక్కడి తోడా గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. వారు పాటలు పాడుతుండగా రాహుల్ గాంధీ కూడా వారిని అనుసరించారు. తోడా గిరిజనుల మాదిరిగానే వారి సంప్రదాయ దుస్తులు ధరించి.. రాహుల్ ఆడిపాడారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఊటీ సమీపంలోని ముత్తునాడు గ్రామంలో తోడా గిరిజన సంఘం సభ్యులతో రాహుల్ గాంధీ శనివారం (ఆగస్టు 12న) భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రాహుల్ గాంధీ శనివారం ఉదయం కొయంబత్తూర్​ చేరుకున్నారు. అనంతరం కేరళలోని తమ పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్​లో పర్యటించారు. రాహుల్​గాంధీ ఎంపీ స్టేటస్​ను లోక్​సభ సచివాలయం పునరుద్ధరించిన తర్వాత.. రాహుల్​ తన నియోజకవర్గానికి రావడం ఇదే ఫస్ట్ టైం. 

రెండు రోజుల కేరళ, తమిళనాడు పర్యటనల అనంతరం రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ వారంలో బెల్జియం, ఫ్రాన్స్, నార్వే దేశాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. అక్కడ ఆయన యూరోపియన్ యూనియన్ ఈయూ పార్లమెంట్ సభ్యులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.