న్యూఢిల్లీ: లోక్‌సభలో ఉన్న ప్రతి ఆరుగురు బీజేపీ ఎంపీల్లో ఒకరు ఓట్ల చోరీ ద్వారా గెలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాంటి వారిని బీజేపీ భాషలో ‘చొరబాటుదారులు’ అని పిలవాలా? అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. “ఓట్ల దొంగతనం ద్వారా కొన్ని సందర్భాల్లో ఒక్కో సీటు, మరికొన్ని సందర్భాల్లో మొత్తం ప్రభుత్వాలనే దోచుకుంటున్నారు.
లోక్‌సభలో ఉన్న 240 మంది బీజేపీ ఎంపీల్లో సుమారు ప్రతి ఆరో వ్యక్తి ‘ఓట్ చోరీ’ ద్వారా గెలిచాడు” అని విమర్శించారు. “అలాంటి వారిని గుర్తించడం కష్టం కాదు. మరి బీజేపీ పదజాలంలో వారిని ‘చొరబాటు దారులు’ అని పిలవాలా? ఇక హర్యానాలో అయితే మొత్తం ప్రభుత్వమే ‘చొరబాటుదారుల ప్రభుత్వం” అని విమర్శలు చేశారు
