తుక్కుగూడ జనజాతర: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

తుక్కుగూడ జనజాతర: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

తుక్కుగూడ జనజాతర సభ కోసం హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఎయిర్పోర్ట్ వద్ద ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుండి తుక్కుగూడ జనజాతర సభా ప్రాంగణానికి బయల్దేరారు రాహుల్. ఈ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా, ఇప్పటికే భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.