ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెల్లడి కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశారు. ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తానని రాహుల్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు వాలంటీర్ల కృషికి , అంకితభావానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించి, పాఠాలు నేర్చుకుని భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. 
 

 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్