తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరిదశకు చేరాయి. బీఏసీ నిర్ణయం ప్రకారం ఇవాళ్టితో సభ ముగియనుంది.  సభకు హాజరైన కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.  అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రియా బృందం హైదరాబాద్ వచ్చింది. ఆస్ట్రియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, పార్లమెంట్ సభ్యుల బృందం అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షిస్తుంది.

111 జీవో అర్ధ రహితం.. ఈ జీవోను ఎత్తేస్తాం

జంటనగరాల తాగునీటి కోసం తీసుకొచ్చిన 111 జీవోపై కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.  111 జీవో అర్ధ రహితం.. ఈ జీవోను ఎత్తేస్తామని పేర్కొన్నారు. ‘హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల తాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ జీవో విడుదల చేశారు. ఈ జీవో కింద లక్షా 32 వేల 600 ఎకరాల స్థలముంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్‎లు కలుషితం కాకుండా అప్పట్లో ఈ జీవో పెట్టారు. ఇప్పుడు అసలు ఆ నీళ్లే వాడటం లేదు. మరో 100 సంవత్సరాల వరకు హైదరాబాద్‎కు తాగునీటి సమస్య రాదు. ఎక్స్‎పర్ట్ కమిటీ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ రిపోర్టు రాగానే గ్రీన్ జోన్, మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ 111 జీవోను ఎత్తివేస్తాం’ అని సీఎం తెలిపారు.

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళితబంధు

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళిలబంధు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బ్యాంకు నుంచి నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని ఆయన అన్నారు.  ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో ఈ పథకం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. దళితులందరికోసం ‘దళిత రక్షణ నిధి’ పేరుతో 4 వేల కోట్లు కేటాయించామన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం

ఎవరి మాటలో నమ్మి సమ్మెకు పోయి.. ఉద్యోగాలు ఊడగొట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులలోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ‘ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం. మరోసారి వారు పొరపాటు చేయొద్దు. ఎంతోమందికి ఎన్నో చేశాం.. వారికి మాత్రం ఎందుకు చేయం. సెర్ప్‎లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను మేం చదివిస్తాం

ఉక్రెయిన్ లో చిక్కుకొని చదువులు మధ్యంతరంగా వదిలేసి వచ్చిన తెలంగాణ విద్యార్థుల తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారు. ‘దాదాపు 740 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. వారందరి చదువుకు అయ్యే ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది’ అని కేసీఆర్ ప్రకటించారు.

ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం?

యూపీఏ మీద నిందలు మోపి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది. బీజేపీని నమ్మి ఓటేసినందుకు ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోయినట్లుగా మారింది. దేశ ఆర్థిక పరిస్థితి పడిపోవడానికి కరోనా కారణం కాదు. ఎప్పటినుంచో దేశ ఆర్థిక పరిస్థితి పడిపోయింది. హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు. బెంగళూరు ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి రూ. 3 లక్షల కోట్లు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం. మత కలహాలు పెట్టి హిజాబ్ పంచాయితీ పెట్టారు. ఇలాంటి ఆలోచనలు చేస్తే దేశం ఏమవుతుంది? హిజాబ్ లాంటి ఇష్యూలు ఉంటే దేశానికి పారిశ్రామికవేత్తలు వస్తారా? ఇలాంటి వివాదాలు దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి. కేంద్ర తీరును అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. కొందరు దేశంలో విషభీజాలు నాటుతున్నారు.

ఉర్దూ మీడియం వారి కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పోస్టుల భర్తీపై సర్కారు ప్రకటన చేయటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అవసరం ఎంతో ఉందన్నారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం.. ఉర్దూ స్టడీ సెంటర్లు.. పాత బస్తీలో స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాల ని కోరారు అక్బరుద్దీన్.

వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇవ్వాలి:ఎమ్మెల్యే సీతక్క
వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇవ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. అసెంబ్లీ జీరో అవర్ లో వీఆర్ఏల సమస్యలపై సీతక్క మాట్లాడారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఏలు పునాదిలాంటి వీఆర్ఏలు రాష్ట్రంలో 25వేల మంది ఉన్నారని, వీరంతా  సరైన జీతాలు, ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. 

అప్పుల్లో తెలంగాణది 25 వ స్థానం

చట్ట సభల్లో ప్రతి విషయంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు సీఎం కేసీఆర్.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వివరణ ఇచ్చిన కేసీఆర్..  బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శించడం సహజమేనన్నారు. బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కాదన్నారు. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం అన్నట్లు భావిస్తున్నారన్నారు. బడ్జెట్ అంటే అధికారపక్షం ఆహా అంటది..ప్రతిపక్షం పసలేదంటదన్నారు.బడ్జెట్ అంటే నిధుల కూర్పు అని అన్నారు.  ప్రభుత్వానికి రెండు అధికారాలు ఉంటాయన్నారు. ఒకటి ట్యాక్స్ విధించే అధికారం..రెండవది అరెస్ట్ చేసే అధికారం అని అన్నారు. అప్పులను అప్పుగా చూడొద్దని.. వనరుల సమీకరణగా చూడాలన్నారు.

అప్పుల్లో మన రాష్ట్రం దేశంలో 25వ స్థానంలో ఉందన్నారు. ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటిస్తున్నామన్నారు. మనకంటే ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయన్నారు. మన అప్పుల శాతం 23 శాతమేనన్నారు. అప్పులపై భట్టికి ఆందోళన అవసరం లేదన్నారు.ప్రస్తుతం భారత దేశ అప్పు152  లక్షల కోట్లు అని అన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం..రాష్ట్రాలను అణిచివేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉందన్నారు. కేంద్రం ఇష్టమున్నట్లు నిధుల సమీకరణ చేసుకుంటుందన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నీతినే కేంద్రం పాటించాలన్నారు. కేంద్రం ఫర్ఫామెన్స్ సరిగ్గా లేదని..మనకంటే బ్యాడ్ గా ఉందన్నారు. నిధుల సమీకరణపై కేంద్రం ఆంక్షలు పెడుతుందన్నారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. 

సంపదను సృష్టించే రాష్ట్రం తెలంగాణ: భట్టి

 రాష్ట్రానికి కేంద్రం మెడికల్ కాలేజ్  ఇవ్వలేదన్నారు భట్టి విక్రమార్క. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన భట్టి.. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందన్నారు. కరోనా పరిస్థితులను తట్టుకుని ఉత్పత్తులను పెంచిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు రావడం లేదన్నారు. రాష్ట్రంలోని సంపదను ప్రజలకు పంచాలన్నారు. బడ్జెట్ వాస్తవాలకు కూడా సరిగ్గా లేదన్నారు. ప్రతి ఏడాది అప్పులు పెరుగుతున్నాయన్నారు. ట్యాక్స్ రెవెన్యూలో కూడా చాలా తేడాలున్నాయన్నారు. రైతుబంధు ఇచ్చి  సంక్షేమ పథకాలను పక్కకు పెట్టారన్నారు. బడ్జెట్ అంచనాలను సాధించకపోతే  నష్టపోయేది పేదవారేనన్నారు. నిరుధ్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. కరెంట్ చార్జీలపై సమీక్ష జరపాలన్నారు. గొర్రెల పంపిణీని త్వరగా పూర్తి చేయాలన్నారు.

సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్

అసెంబ్లీకి హాజరైన సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టారు ఈ బిల్లుపై మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ చర్చను ప్రారంభించారు.

VRAల సమస్యలను పరిష్కరించాలి

VRAల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎమ్మెల్యే సీతక్క. అసెంబ్లీ జీరో అవర్ లో VRAల సమస్యలపై సీతక్క మాట్లాడారు. VRAలకు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సరైనా జీతాలు, ప్రమోషన్లు లేక VRAలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పే స్కేలు జీవో అమలు చేయాలని కోరారు.

అసెంబ్లీలో రాష్ట్రఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్

అసెంబ్లీకి రిపోర్టిచ్చింది కాగ్. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. తీసుకుంటున్న అప్పులు FRBM పరిధిలో ఉన్నా.. బడ్జెటేతర అప్పులు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. 2019-20లో ప్రభుత్వం తీసుకున్న రుణంలో.. 75 శాతం 2018-19లో తీసుకున్న అప్పులు చెల్లించేందుకే సరిపోయిందని రిపోర్టులో తెలిపింది కాగ్.

2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని తేల్చిచెప్పింది కాగ్. బడ్జెట్ పర్యవేక్షణలో సర్కారుకు నియంత్రణ లేదని స్పష్టంచేసింది. కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని.. కొన్ని శాఖల్లో మిగులు బడ్జెట్ ను తగిన సమయంలో తిరిగి చెల్లించలేదంది. వివిధ శాఖల్లో పదేపదే మిగులు బడ్జెట్ ఏర్పడినా సంబంధిత శాఖలను హెచ్చరించలేదని రిపోర్టులో తెలిపింది. బడ్జెట్ ను పుర్తిస్థాయిలో ఖర్చుచేసే శాఖలకు కేటాయింపులు పెంచలేదని.. గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధిక వ్యయం ఖర్చవుతోందని తెలిపింది కాగ్. 

బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థన తిరస్కరణ

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో స్పీకర్ ను కలిశారు BJLP నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు. అసెంబ్లీ లోపలికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు... ముందుగా అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఆ తర్వాత స్పీకర్ ను కలిసి తమ వాదనలు వినిపించారు. అయితే ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని తెలిపారు. దీంతో అసెంబ్లీ నుంచి  బీజేపీ స్టేట్ ఆఫీస్ కు బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. 

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ మొదలైన ఫస్ట్ డేనే సస్పెన్షన్ కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. ఇవాళ (చివరి రోజు) మళ్లీ సభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సస్పెన్షన్ పై హైకోర్టుకు వెళ్లగా.. స్పీకర్ ను కలిసి వాదనలు వినిపించాలని ఆదేశించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురు కలిసి ఇవాళ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవనున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఆయనకు అందజేసి.. సభలోకి ప్రవేశం కల్పించాలని కోరనున్నారు. 

బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే.. సభలో గొడవ చేశారనే ఆరోపణలతో ముగ్గురు బీజేపీ సభ్యులను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు స్పీకర్. బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించటంతో....నిన్న తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యేలు.. స్పీకర్ దగ్గరకు వెళ్లి తమ వాదనను వినిపించాలని తెలిపింది. ఎమ్మెల్యేలను.. అసెంబ్లీ సెక్రటరీ స్వయంగా స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పింది. ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. బీజేపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ పై గతంలో ఇచ్చిన నోటీసు తీసుకోలేదంటూ అసెంబ్లీ సెక్రటరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ ఆఫ్ హైకోర్టు స్వయంగా వెళ్లి నోటిసును అసెంబ్లీ సెక్రటరికి ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన నోటీసును పోలీస్ కమిషనర్ కూడా వెళ్లి అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వాలని ఆర్డర్ వేసింది. దీంతో స్పీకర్ ను కలిసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.

పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం

పల్లెప్రగతి దేశానికే ఆదర్శంగా మారిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పటికే 4విడతలుగా పల్లె ప్రగతి కారక్రమం చేశామన్నారు. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. సర్పంచులు, జెడ్పీటీసీలకు వేతనాలు భారీగా పెంచుకున్నామని చెప్పారు.

వాస్తవాలను ఒప్పుకోలేక విపక్షాల దుష్ప్రచారం

ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ సభ్యుల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ప్రాణహిత పేరుతో 4 జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు కొబ్బరికాయలు కొట్టారన్నారు. సమైక్య పాలనలో 400 టీఎంసీ నీళ్లు కూడా వాడుకోలేకపోయామని చెప్పారు. శ్రీరాంసాగర్ తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని.. శ్రీపాదకు అన్ని పర్మిషన్లు ఉన్నా ప్రాజెక్ట్ పూర్తి చేయలేదన్నారు. విపక్షాలు వాస్తవాలను ఒప్పుకోలేక దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశం మన నుంచి నేర్చుకునేంత గొప్పగా సాగునీటి ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. స్మశాన తెలంగాణను మీరు ఆవిష్కరిస్తే... సస్యశ్యామల తెలంగాణను మేము ఆవిష్కరించామన్నారు.

తలసాని vs రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రాక్టర్ అనడంపై దుమారం రేగింది. ఆ వెంటనే.. పేకాట ఆడేవాళ్లు మంత్రులు కాగా లేనిది.. కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అయితే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామన్నారు స్పీకర్ పోచారం. తలసాని, రాజగోపాల్ ఇద్దరిదీ తప్పేనని.. వారిద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు సీఎల్పీ నేత భట్టి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కలుగజేసుకున్నారు. మంత్రిపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారి చెప్పకుంటే.. చర్యలు తీసుకుంటామనడంతో.. చివరకు రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ప్రాజెక్టులు, అవినీతిపై సభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు మేం కట్టినవేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్రెడ్డి అన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేర్లు మార్చారంటూ విమర్శలు చేశారు. దీనికి మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పోలవరంలో మునిగిపోతున్నాయన్నారు. తర్వాత పువ్వాడ వ్యాఖ్యలను తప్పుబట్టారు భట్టి. దీంతో అధికార, విపక్షాల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. 

8 ఏళ్ళైనా పూర్తికాలే

మధిర నియోజకవర్గంలో మున్నేరు పైన కట్టిన ఆనకట్ట నుంచి నీరు వృధాగా పోతుందన్నారు భట్టి విక్రమార్క. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి 8 ఏళ్లు అవున్నా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదన్నారు. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం చెక్ డ్యాంల వరకే పరిమితం కాలేదని ఇతర రాష్ట్రాల పర్మిషన్ కూడా ఉందని తెలిపారు. వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి డిమాండ్ చేశారు. 

శాసనమండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా

మరోసారి  మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయనకు పోటీ ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు.. అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. దీంతో మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి బాధ్యతలు స్వీకరించారు. మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నుంచి గుత్తా బాధ్యతలు తీసుకున్నారు. 

సబ్సిడీకే ఆయిల్ ఫామ్ మొక్కలు

11 వేల మందికి పైగా రైతులను ఆయిల్ పామ్ తోటల సందర్శనకు తీసుకెళ్లామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయిల్ పామ్ తోటల్లో మూడు సంవత్సరాల వరకు అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు. నాలుగో సంవత్సరం నుంచి పంట వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ వేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తున్నామన్నారు. 11వందల ఎకరాల్లో నర్సరీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. నర్సరీలల్లో రెండు లక్షల ఎకరాలకు సరిపడా మొక్కలు ఉన్నాయన్నారు. డ్రిప్ల పై పెరిగిన ధరలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఆయిల్ ఫామ్ మొక్కలను సబ్సిడీతో  నేరుగా రైతులకు అందిస్తామన్నారు. పంట మార్పిడికి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతు వేదికలలో రైతులకు శిక్షణ అందిస్తున్నామన్నారు.

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం మూడు మెడికల్ కాలేజ్ లు మాత్రమే వచ్చాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఆరేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. తెలంగాణకు కేంద్ర తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి హరీశ్ రావు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో  700 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం 2వేలకు పైగా సీట్లు పెంచామన్నారు. కరోనా వంటి మహమ్మారి వైరస్ లు వచ్చినా ఎదుర్కునేలా ఐదంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిమ్స్ తో పాటు మరో ఐదు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నిమ్స్ లో మరో 2వేల పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు హరీశ్ రావు. ప్రొఫెసర్స్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. 

అసెంబ్లీ ముట్టడికి ఓసీ సంఘాల యత్నం

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల నేతలు. రెడ్డి కార్పొరేషన్ తో పాటు వైశ్య సామాజిక వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. 50 ఏళ్లు దాటిన అన్ని వర్గాల రైతులకు నెలకు 5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సవరణలకు ఉదయం 11.30 వరకే గడువు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే.. ఇవాళ చర్చించి ఆమోదించబోయే బిల్లుల వివరాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ, అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ అమెండ్ మెంట్ బిల్ -2022, తెలంగాణ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెట్ అమెండ్ మెంట్ బిల్ - 2022లను సభలో ఆమోదించనున్నట్లు తెలిపారు. ఈ బిల్లులపై ఏవైనా సవరణలు ఇవ్వదలుకుచుకుంటే ఉదయం 11.30 గంటలలోపు మాత్రమే సబ్మిట్ చేయాలని సభ్యులకు సూచించారు.

వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

సభలో ఇవాళ ముందుగా ప్రశ్నోత్తరాలు.. ఆ తర్వాత డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ పై చర్చ జరగనుంది. అటు యాసంగిలో వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

మూడోసారి TRSని నమ్మే పరిస్థితి లేదు

సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూడటం లేదన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సింగరేణిని ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ పరం చేయడం లేదని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రా పెట్టుబడిదారులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోని రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారని...మూడోసారి TRSని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు రాజగోపాల్ రెడ్డి.

కేంద్రం హైదరాబాద్ కు వరదసాయం ఇవ్వలేదు

అసెంబ్లీ వేదికగా కేంద్రంపై ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో వరదలు వస్తే కేంద్రం రూపాయి సాయం చేయలేదన్నారు. కేంద్రమంత్రులు వచ్చి ఫొటోలు దిగి వెళ్లారే తప్ప చేసిందేమీ లేదన్నారు. గుజరాత్ లో వరదలు వస్తే స్వయంగా ప్రధాని వెళ్లి వెయ్యి కోట్ల సాయం ప్రకటించారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై ఒక్క మాట మాట్లాడరని మండిపడ్డారు కేటీఆర్. 

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా?

సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని.. డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై అసహనం వ్యక్తం చేశారు  TRS MLA రసమయి బాలకిషన్. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో.. డిప్యూటీ స్పీకర్..ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రసమయి ప్రశ్న అడుగుతుండగా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని మైక్ కట్ చేసి.. ఎమ్మెల్యే గొంగిడి సునీతకు అవకాశం ఇచ్చారు డిప్యూటీ స్పీకర్. క్వశ్చన్ అడగనివ్వకుంటే ప్రశ్నలు ఎందుకు ఇస్తున్నారని అడిగారు MLA రసమయి. ప్రశ్నలు తొందరగా అడగాలన్నారు డిప్యూటీ స్పీకర్. సభలో మాట్లాడుదాం అంటే అవకాశాలు రావని.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా అన్నారు రసమయి.

రాష్ట్రంలో చిల్లరగాండ్లు తయారయిండ్రు
కాంట్రాక్ట్‎ల కోసం కొంతమంది నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజకీయం పేరుతో బ్లాక్ మెయిల్‎కు దిగుతున్నారని మండిపడ్డారు. ఓ పక్క రాజకీయాలు చేస్తూ.. మరోపక్క కాంట్రాక్టులు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ అవసరమైతే మరో ఉద్యమం కూడా చేస్తారని ఆయన అన్నారు.

మేం ఉద్యమకారులం.. మీరంతా  పెట్టుబడుదారులు
సింగరేణి సంస్థ తెలంగాణకు కొంగు బంగారం అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సంపద పెంచుతాం.. ప్రజలకు పంచుతాం అని నొక్కివక్కానించారు. సింగరేణి చుట్టుపక్కల ఉన్న  బొగ్గు బావులు మావి మాకే కావాలని సీఎం కేసీఆర్, కేటీఆర్  కేంద్రానికి లేఖ రాసినా వేలానికి పెట్టడం దారుణమన్నారు.   మేం ఉద్యమకారులం.. మీరంతా  పెట్టుబడుదారులు అని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులపై మండిపడ్డారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాలెడ్జ్ లేదు.. చెబితే వినరు
ఎవరికోసమో సింగరేణి టెండర్లు వేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సంస్థకు రూ. 20 వేల కోట్ల నష్టం వచ్చే విధంగా ప్రభుత్వం టెండర్లు పిలుస్తోందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాలెడ్జ్ లేదు.. చెబితే వినరు అని రాజగోపాల్ ఎద్దేవా చేశారు. పైగా మమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అంటున్నారని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తల్లుల మరణాలు తగ్గాయి: మంత్రి హరీశ్ రావు
కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ  ఆస్పత్రులలో ప్రసవాల శాతం బాగా పెరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు లక్షకు 94 మంది తల్లులు చనిపోయేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 63కు తగ్గింది. దేశంలో తల్లుల మరణాలు 113గా ఉంది. అదేవిధంగా పిల్లలు గతంలో 39 మంది చనిపోతే.. ఇప్పుడు ఆ సంఖ్య 23కి చేరింది. తల్లులు, పుట్టబోయే బిడ్డల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

విద్యార్థుల కోసం రెండు భాషలలో పుస్తకాలు: విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన
  • 9వ తరగతి విద్యార్థులకు 2023 2024లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ప్రారంభం
  • 10వ తరగతి విద్యార్థులకు 2024 2025లో  ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ప్రారంభం
  • ఒకేసారి ఆంగ్ల బోధన అర్థంకాదనే భావనతో  విద్యార్థుల కోసం రెండు భాషలలో పుస్తకాల పంపిణీ

లవ్ మ్యారేజ్ చేసుకున్నా కల్యాణలక్ష్మి

కులాంతర విహహాలు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వర్తిస్తుందన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. ప్రేమ పెళ్లి చేసుకన్న మహిళలు దర్జాగా ఈ పథకానికి అప్లే చేసుకోవచ్చని తెలిపిన మంత్రి.. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుని కూతరు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా.. తల్లికి కూడా డబ్బులు ఇస్తామని తెలిపారు.    కరోనా వచ్చి రాష్ట్రం ఆగమైనా ఎక్కడా కల్యాణలక్షి, షాదీముబారక్ ఆగలేదని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. 

80, 039 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్
షెడ్యూల్ 9,10 వివాదం పరిష్కారమైతే 10 నుంచి 20 వేల ఉద్యోగాలు కొత్తగా వస్తాయి. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను వెంటనే నింపాలని కేసీఆర్ అన్నారు. అందుకోసం ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించారు. అరకొర జీతంతో ఉన్న 11, 103 కాంట్రాక్టు ఉద్యోగులను ఈ క్షణం నుంచి రెగ్యులరైజ్ చేస్తున్నాం. మిగిలిన 80 వేల ఉద్యోగాలకు ఈరోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయి.

ఉద్యోగ వయసు పరిమితి పెంపు

ఉద్యోగాల కోసం ఎదురు చూసిచూసి వయసు పెరగడంతో నిరాశకు గురవుతున్న నిరుద్యోగులకు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా శుభవార్త చెప్పారు. యూనిఫాం పోస్టులకు కాకుండా.. మిగతా ఉద్యోగాలకు వయసు పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా 10 ఏండ్ల గరిష్ఠ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ట వయో పరిమితి లభించనుంది.

గ్రూపుల వారీగా ఖాళీలు
గ్రూప్1 పరిధిలో 503
గ్రూప్ 2 పరిధిలో 582 
గ్రూప్ 3 పరిధిలో 1,373
గ్రూప్ 4 పరిధిలో 9,168

ఏయే శాఖలో ఎన్ని ఖాళీలున్నాయంటే..

పోలీస్ శాఖలో 18,334
సెకండరీ విద్యాశాఖలో 13,086 
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ 12, 755 పోస్టులు
ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు
బీసీ సంక్షేమం 4,311
రెవెన్యూలో 3,560 పోస్టులు
ఎస్సీ డెవలప్ మెంట్ 2,879
ఇరిగేషన్ లో 2,692 పోస్టులు
ట్రైబల్ వెల్ఫేర్ 2,399
మైనార్టీస్ లో 1,825
ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1598
పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖలో  1,455
కార్మికశాఖలో 1,221
ఫైనాన్స్ శాఖలో 1,146
సంక్షేమశాఖలో 895
మున్సిపల్ శాఖలో 859
వ్యవసాయ శాఖలో 801
రవాణా శాఖలో 563
న్యాయశాఖలో 386
పశుసంవర్ధక శాఖలో 353
పరిపాలన శాఖలో 343
ఇండస్ట్రీస్ శాఖలో 233 
టూరిజం శాఖలో 184
సివిల్ సప్లై శాఖలో 106
అసెంబ్లీలో 25
ఎనర్జీ శాఖలో 16

క్యాడర్ వారీగా ఖాళీలు
జిల్లాలు 39829
జోనల్ 18,866
మల్టీజోనల్ 13170
సచివాలయం హెచ్ వోడిలు,విశ్వవిద్యాలయాలు 8147

జోన్ వారీగా ఖాళీలు
 జోన్ 1 కాళేశ్వరం 1630
జోన్2 బాసర 2328
జోన్3 రాజన్నసిరిసిల్లా 2403
 జోన్ 4 భద్రాద్రి 2858
జోన్ 5 యాదాద్రి 2160
జోన్ 6 చార్మినార్ 5297
జోన్ 7 జోగులాంబ 2190
 మొత్తం 18,866


మల్టీ జోన్ వారీగా ఖాళీలు
మల్టీజోన్ 1 - 6800
మల్టీజోన్ 2 -6370
మల్టీ జోన్ మొత్తం 13170

అసలు ఉద్యోగి కంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఎక్కువ పనిచేస్తడు
ఉద్యోగాలలో కాంట్రాక్ట్ అనే పదం ఉండకూడదని భావించాం. అందుకోసం ఎంప్లాయ్ ఫ్రీ గవర్నమెంట్ విధానంతో ముందుకెళ్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయి. మేం అలా ఎందుకు అన్నామంటే.. అసలు ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తున్నారు. అయినా వారి జీతాలు మాత్రం తక్కువ. అందుకే కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండొద్దనేది మా అభిలాష.

ఇక నుంచి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
ఇప్పటివరకు 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం. వాటిలో 1.30 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేశాం. మిగిలిన 22 వేల ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అటెండర్ నుంచి ఆర్డీవో దాక స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తే.. మంచి ఫలితాలు వస్తాయి.

ఉద్యమంలో నేను కూడా దెబ్బలు తిన్నా  

రాష్ట్ర ఏర్పాటు దేశచరిత్రలోనే ముఖ్యమైన ఘట్టం. ఉద్యమంలో నేను కూడా దెబ్బలు తిన్నాను.  అంతులేని వివక్ష, అన్యాయం జరిగింది. మాకు రాజకీయాలంటే టాస్క్. చిల్లరగాళ్లను వదిలిపెట్టాను. నీళ్లు, నిధులు, నియామకాలు చాలా ముఖ్యం. పదవుల కోసం ఆనాడు మనవాళ్లు మౌనం వహించారు. మన సంసృతిపై ఆనాడే దాడి జరిగింది. నీళ్ల కోసం ఇంకా కొట్లాడుతున్నాం. నీళ్లు, నిధులు మనకే వస్తున్నాయి. నీళ్లు రావడంతో పంటలు పండుతున్నా.. కేంద్రం ధాన్యం కొనని చెబుతోంది.  కరెంట్ ఉద్యోగుల పంచాయతీ సుప్రీంకోర్టు దాకా పోయింది. ఏపీ వాళ్లు పెట్టే పంచాయతీ అర్ధరహితంగా ఉంది.