బీజేపీ ఇచ్చిన లిస్టుతో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది: రాహుల్ గాంధీ

బీజేపీ ఇచ్చిన లిస్టుతో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది: రాహుల్ గాంధీ

తెలంగాణలో దొరల సర్కార్ పోయి.. ప్రజల సర్కార్ రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం నాంపల్లిలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీ ప్రంసంగంలో హైలెట్స్:

  • తెలంగాణలో దొరల సర్కార్ పోవాలి. 
  • బీజేపీ ఇచ్చిన లిస్టుతో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది.
  • ఏం చేసినా.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే చేస్తాయి. 
  • మోదీ, కేసీఆర్, ఓవైసీలు ఒక్కటే.
  • రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతున్నాయి.
  • కేసీఆర్ కు బై బై చెప్పే సమయం వచ్చింది.
  • ఢిల్లీలో మోదీని ఓడించాలంటే.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించాలి.
  • పార్లమెంట్ లో బీజేపీకి అన్ని రకాలుగా బీఆర్ఎస్ సహకరించింది.
  • నోట్ల రద్దు, జీఎస్టీలో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోంది.
  • బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది.
  • కాంగ్రెస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి.
  • కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
  • ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంది.
  • ప్రతి నెల మహిళ ఖాతాలో రూ.2500 వేస్తాం.
  • రూ.500లకే ఇంటి గ్యాస్ సిలిండర్ ఇస్తాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం.
  • రైతులకు ఎకరానికి రూ.15వేలు పెట్టుబడి సాయం అందింస్తాం.కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తాం.
  • 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. ఇళ్లల్లో 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ
  • ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దుతాం.