మంగళవారం కూడా రాహుల్ను ప్రశ్నించనున్న ఈడీ

మంగళవారం కూడా రాహుల్ను ప్రశ్నించనున్న ఈడీ

‘నేషనల్ హెరాల్డ్’  కేసులో నాలుగో రోజైన సోమవారం రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. గత నాలుగు రోజుల్లో దాదాపు 40 గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. అయితే మంగళవారం (జూన్ 21న) కూడా విచారణకు హాజరుకావాలని రాహుల్ కు ఈడీ సూచించిందంటూ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.  ‘నేషనల్ హెరాల్డ్’  పత్రిక కేసులో గాంధీ కుటుంబం పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఆ పత్రికను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ను ‘యంగ్ ఇండియన్’ సంస్థకు బదలాయించే క్రమంలో జరిగిన రూ.800 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, అవకతవకలపై సోనియా, రాహుల్ గాంధీని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.