రాహుల్ కి మద్దతుగా నిరసనలు.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు

రాహుల్ కి మద్దతుగా నిరసనలు.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు నేడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకీ సమన్లు జారీ చేయగా... నేడు విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇవాళ రాహుల్ గాంధీ ఈడీ ముందుకు రానుండగా.. జూన్ 23వ తేదీన సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు పిలుపినిచ్చింది. కాగా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి మద్దతు నినాదాలు పలుకుతూ..  ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులను పోలీసులను అడ్డుకొని.. అరెస్టు చేశారు.  ఈ ర్యాలీకి ముందునుంచే పోలీసులు నిరాకరించినప్పటికీ.. పార్టీ నేతలు మాత్రం నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ముఖ్య  నేతలు, ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భఘేల్ లు పాల్గొననున్నారు. గతంలో ఇదే కోసులో సోనియా, రాహుల్ లు పటియాలా కోర్టుకు హాజరైన సందర్భంలోనూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.